Rainfall Telangana : దంచి కొట్టిన వానలు..యాదాద్రిలో వర్షపు నీటిలోనే అర్చకుల పూజలు

నైరుతి రుతుపవనాలు ప్రవేశించక ముందే ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

Rainfall Telangana : దంచి కొట్టిన వానలు..యాదాద్రిలో వర్షపు నీటిలోనే అర్చకుల పూజలు

Rainwater Seeps Into Yadadri Temple

Yadadri Temple : నైరుతి రుతుపవనాలు ప్రవేశించక ముందే ఉపరితల ఆవర్తనంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. రెండు రోజుల నుంచి చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా ఆరుట్ల, హైదరాబాద్‌లో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నల్లగొండ జిల్లా ఎర్రారంలో 4.4 సెంటీమీటర్లు, రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఖరీపై సాగుపై రైతన్నల దృష్టి :-
పలు చోట్ల 2.6 సెంటీ మీటర్లు వర్షం కురిసింది. వర్షాలు ప్రారంభం కావడంతో రైతులు ఖరీఫ్‌ సాగుపై దృష్టి పెట్టారు. విత్తనాల కొనుగోలు చేస్తున్నారు. నిన్న, మొన్న పడిన వర్షాలకు కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మార్కెట్‌ యార్డులు, ఐకేపీ కేంద్రాలకు రైతులు తీసుకొచ్చిన ధాన్యం తడిచిపోయింది. ఆరుగాలం శ్రమించి పండిన పంట తడిపోవడంతో అన్నదాతలు నష్టపోయారు.

యాదాద్రి బాలాలయం :-
మరోవైపు…ఉదయం నుంచి భారీగా కురుస్తున్న కుండపోత వానకు యాదాద్రి బాలాలయం నీట మునిగింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో బాలాలయంలోకి భారీగా నీరు చేరింది. వర్షపు నీటితో బాలాలయం మొత్తం చెరువుగా మారింది. యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మిస్తుండటంతో తాత్కాలికంగా బాలాలయంలోనే నిత్య పూజలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షం పడటంతో బాలాలయం మునిగిపోయింది. అయినా పూజాదికాలకు ఎలాంటి ఆటంకం లేకుండా…నీటిలో కూర్చోనే నిత్య పూజలు నిర్వహించారు.

తడిచిపోయిన పంటలు :-
ఇక రైతన్నల కష్టం అంతా ఇంత కాదు..ఆరుగాలం కష్టం చేసి పండించిన పంట.. అమ్ముకునే ముందు తెలంగాణలో రైతులను అకాల వర్షాలు ఇబ్బందులు పెడుతున్నాయి. పండిన పంటలు తడిచిపోవడంతో.. పెట్టిన పెట్టుబడే రాని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చి వారాలు, నెలలు గడుస్తున్నా.. అధికారులు ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడమే ఇందుకు కారణం. దీంతో అకాల వర్షాలకు ధాన్యమంతా నీటిపాలవుతోంది.

అల్లాడుతున్న రైతులు, వ్యాపారులు :-
మహబూబాబాద్‌లో అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన వరిధాన్యం తడిసిపోయింది. దీంతో తడిచిన ధాన్యం ఎలా అమ్ముకోవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. గత పదిహేను రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చినా.. ఇప్పటికీ కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయల మార్కెట్‌లో కూడా అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారీగా కురుస్తున్న అకాల వర్షాలతో కూరగాయలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియకు మార్కెట్ వ్యాపారులు, రైతులు అల్లాడుతున్నారు.

నల్గొండలో భారీ వర్షాలు :-
భారీ వర్షాలు నల్గొండ జిల్లాను ముంచెత్తుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. నాంపల్లి మండలం రాందాస్‌ తండా వద్ద శేషిలేటి వాగు పొంగింది. రోడ్ల పైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చండూరు వాగు పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది. వరద నీటితో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Read More : Murder : 12ఏళ్లు ప్రేమించాడు.. ఆ అనుమానంతో చంపేశాడు