బంధువే చేయించాడు, డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో కీలక విషయాలు

  • Published By: naveen ,Published On : October 28, 2020 / 11:43 AM IST
బంధువే చేయించాడు, డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో కీలక విషయాలు

doctor hussain kidnap: హైదరాబాద్ లో సంచలనం రేపిన డెంటల్ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసులో పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నాప్ వెనుక ఉన్నది డాక్టర్ బంధువే అని తేలింది. డాక్టర్ హుస్సేన్ బ్యాంకు అకౌంట్ లో పెద్ద మొత్తంలో నగదు ఉందని అతడి బంధువు ముస్తఫా తెలుసుకున్నాడు. ఎలాగైనా డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగా హుస్సేన్ కిడ్నాప్ కి స్కెచ్ వేశాడు.

డాక్టర్ హుస్సేన్ ఇంటిపైన రెంట్ కి ఉండే ఖలీద్ అనే వ్యక్తిని సంప్రదించిన ముస్తఫా, అతడి ద్వారా డాక్టర్ ని కిడ్నాప్ చేయించాడు. డాక్టర్ హుస్సేన్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. డాక్టర్ ని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలని ముస్తఫా ప్లాన్ చేశాడు. డాక్టర్ ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు హుస్సేన్ కుటుంబసభ్యులకు వాట్సాప్ కాల్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. డబ్బులు బిట్ కాయిన్ రూపంలోనే కావాలని డిమాండ్ చేశారు.


https://10tv.in/ghaziabad-doctor-dates-married-patient-smothers-her-to-death/
కుటుంబసభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు చేపట్టారు. ఫోన్ నెంబర్ ఆధారంగా వెహికల్ ని ట్రేస్ చేసిన సైబరాబాద్ పోలీసులు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అలర్ట్ అయిన ఏపీ పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు. వారి ప్రయత్నం ఫలించింది. డాక్టర్ హుస్సేన్ ని పోలీసులు సేవ్ చేశారు. ఐదుగురిలో ఒక కిడ్నాపర్ ని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురు తప్పించుకున్నారు.