Major Road Accident : బైక్‌ని ఢీకొన్న లారీ.. తండ్రితో సహా ఇద్దరు పిల్లలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు బీటీపీఎస్ ప్లాంట్ సమీపంలో బైక్‌‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.

10TV Telugu News

Major Road Accident : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మణుగూరు బీటీపీఎస్ ప్లాంట్ సమీపంలో బైక్‌‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. పిల్లల్ని స్కూల్లో చేర్పించడానికి ఓ వ్యక్తి తన కుమార్తె, కుమారుడిటో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనకనుంచి వేగంవా వచ్చిన లారీ వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు ఘటన స్థలిలోనే మృతి చెందగా, కుమార్తె ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయింది.

చదవండి : Major Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం-9 మంది మృతి

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

చదవండి : Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం..అతి వేగానికి 8 మంది బలి