Rythu Bandhu : పోస్టాఫీసుల్లో రైతుబంధు నగదు

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్ధిక భరోసా అందించేందుకు ప్రవేశపెట్టిన రైతు పధకం నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ పధకం కింద రైతులకు రూ. 5000 పెట్టుబడి మద్దతు అందుతుంది.

Rythu Bandhu : పోస్టాఫీసుల్లో రైతుబంధు నగదు

Rytu Bandhu

Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఆర్ధిక భరోసా అందించేందుకు ప్రవేశపెట్టిన రైతు పధకం నగదును వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. ఈ పధకం కింద రైతులకు రూ. 5000 పెట్టుబడి మద్దతు అందుతుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు డబ్బులను విడుదల చేసింది. దీనివల్ల రాష్ట్రంలోని 7.05 లక్షల మందిరైతులకు లబ్ది చేకూరుతుంది.

ఇకపై ఈ డబ్బులను రైతులు పోస్టాఫీసుల్లోనూ విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. పోస్టాఫీసుల్లోని మైక్రో ఏటీయంల ద్వారా రైతులు నగదు పొందవచ్చు. ఇందులో భాగంగా అధికారులు పోస్టాఫీసుల్లో ఏర్పాటు చేశారు. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా ఆధార్‌ కార్డు, మొబైల్‌ నంబర్‌తో పోస్టాఫీసు నుంచి నగదు డ్రా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఆధార్‌ కార్డుతో బ్యాంకు ఖాతా అనుసంధానం ఉన్న వారికే ఈ వెసులుబాటు ఉంటుందని.. రోజుకు రూ.10 వేలకు మించకుండా నగదు పొందే అవకాశం ఉందన్నారు.

రైతు బంధులో డబ్బులు తీసుకునే రైతులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసు మైక్రో ఏటీఎంలలో డబ్బులు తీసుకోవచ్చు. ఆధార్ కార్డుతో పాటు…ఆధార్ నంబర్ రిజిస్టర్ అయి ఉన్న మొబైల్ కూడా రైతులు తీసుకెళ్లాలి. మైక్రో ఏటీఎంలో ఫింగర్ ప్రింట్ వేయగానే రిజిస్టర్‌ అయిన ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ మైక్రో ఏటీఎంల ద్వారా ఒక ఖాతా నుంచి రోజుకు గరిష్ఠంగా రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు.