Special Trains : తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్  మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. 

Special Trains : తిరుపతి-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు

Special Trains

Special Trains :  ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్-తిరుపతి-సికింద్రాబాద్  మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు.

ఏప్రిల్ 23, 30, మే 7,14,21 తేదీల్లో సికింద్రాబాద్ నుంచి సాయంత్రం గం.6-40 ని.లకు బయలు దేరే ప్రత్యేక రైలు నెంబరు 02764 తర్వాతరోజు ఉదయం గం.6-45లకు తిరుపతి చేరుకుంటుంది.

ఏప్రిల్‌ 24, మే 1, 8, 15, 22, 29 తేదీల్లో తిరుపతి నుంచి సాయంత్రం 5 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు నెంబరు 02763 తర్వాతి రోజు ఉదయం 5.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

సికింద్రాబాద్‌-మచిలీపట్నం రైళ్లను జూన్‌ వరకు పొడిగించారు. ఏప్రిల్‌ 24, మే 1, 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26, తేదీల్లో ప్రత్యేక రైలు నెంబరు 07185 మచిలీపట్నం నుంచి బయలుదేరి కాజీపేట మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

ఏప్రిల్‌ 24, మే 1, 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరే ప్రత్యేక రైలు 07186 కాజీపేట మీదుగా మచిలీపట్నం చేరుకుంటుంది.

Also Read : Google Play Store : గూగుల్ అలర్ట్.. మే 11 నుంచి మీ ఫోన్లలో ఆ యాప్స్ పనిచేయవు..!