Bonam Online : అమ్మవారికి ఆన్‌లైన్‌లో బోనం

మహంకాళి అమ్మవారి భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే.. ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని వెల్లడించారు.

Bonam Online : అమ్మవారికి ఆన్‌లైన్‌లో బోనం

Bonam

Bonam online : తెలంగాణలో దేవాదాయశాఖ ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. ఆలయానికి రాలేని భక్తులకు కూడా అమ్మవారి సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. తెలంగాణలో ఈనెల 30 నుంచి ఆషాఢం బోనాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో… సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు… ఆన్‌లైన్‌లో బోనాలు సమర్పించేందుకు దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆన్‌లైన్‌ సేవలను హైదరాబాద్‌ అరణ్‌ భవన్‌లో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.

మహంకాళి అమ్మవారి భక్తులు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే.. ఆలయ నిర్వాహకులే అమ్మవారికి బోనం సమర్పిస్తారని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. గోత్రనామాలతో పూజలు చేసి అమ్మవారి ప్రసాదం నేరుగా ఇంటికి పంపిస్తారని వెల్లడించారు. బోనంలోని బియ్యంతోపాటు… బెల్లం, అక్షింతలు, పసుపు, కుంకుమను పోస్టు ద్వారా పంపిస్తారని.. వాటిని ఇంటివద్దే వండుకొని ప్రసాదంగా స్వీకరించవచ్చని చెప్పారు.

Online Bonam: లష్కర్ బోనాలు ఆన్‌లైన్‌లో సమర్పించండిలా

ఆన్‌లైన్‌లో బోనం సమర్పించే సౌకర్యం జూలై 4 నుంచి అందుబాటులోకి వస్తుందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. టీయాప్ ఫోలియో, మీసేవ, ఆల‌య వెబ్‌సైట్, పోస్ట్‌ ఆఫీస్ ద్వారా భ‌క్తులు ఈ సేవ‌ల‌ను బుక్ చేసుకోవ‌చ్చని చెప్పారు. ఇందుకు దేశీయ భక్తులు 300, అంత‌ర్జాతీయ భక్తులు వెయ్యి చెల్లించాల్సి ఉంటుందన్నారు.