హైదరాబాద్‌లో 75వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసం, ఆ రెండు పార్టీలే కారణం

  • Published By: naveen ,Published On : November 25, 2020 / 03:48 PM IST
హైదరాబాద్‌లో 75వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసం, ఆ రెండు పార్టీలే కారణం

smriti irani ghmc: టీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీలతోనే హైదరాబాద్‌లో 75 వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసముంటున్నారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాయన్నారు. దుబ్బాకలో మాదిరే హైదరాబాద్‌లోనూ బీజేపీని ప్రభుత్వం అడ్డుకుంటుందంటే.. టీఆర్‌ఎస్‌కు ప్రజాదరణ తగ్గిందనే అర్థమవుతోందన్నారు. టీఆర్‌ఎస్‌, ఎంఐఎం అవినీతి కూటమి వైఖరితోనే..హైదరాబాద్‌ వరదలకు 35 వేల కుటుంబాలు ఇక్కట్లు పడ్డాయని, 80 మంది మరణించారని ఆరోపించారు స్మృతి ఇరానీ.



రోహింగ్యాలకు ఓట్లెందుకు?
టీఆర్‌ఎస్‌, ఎంఐఎంపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్‌లో రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చాలని ఎంఐఎం కేంద్రానికి లేఖ రాసిందన్నారు. నగరంలో అక్రమ చొరబాటు దారులపై ఛానెళ్లలో కథనాలు ప్రసారమైనా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసం రోహింగ్యాలను ఓటర్ల జాబితాలో చేర్చిందన్నారు. టీఆర్‌ఎస్‌-ఎంఐఎం అవినీతి కూటమి వల్లే హైదరాబాద్‌లో 75 వేల మంది అక్రమ చొరబాటుదారులు నివాసముంటున్నారని స్మృతి ఇరానీ అన్నారు. రోహింగ్యాల విషయంలో ఫిర్యాదు చేస్తే కేంద్రం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని, అయితే ఇంతవరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించలేదని అన్నారు.

https://10tv.in/high-court-refuses-to-stay-ghmc-elections/