అతివేగం..ఎప్పుడూ విషాదమే, ఈ ప్రమాదాలు అలా జరిగినవే

అతివేగం..ఎప్పుడూ విషాదమే, ఈ ప్రమాదాలు అలా జరిగినవే

speed is increased : రోడ్లపై రయ్యి రయ్యి మంటూ..వేగంగా వెళ్లడం కొంతమందికి సరదా. పరిమితికి మించి ప్రయాణిస్తున్నా..భారీ వాహనాలు ఇష్టానుసారంగా నడిపిస్తుంటారు. గమ్యానికి చేరుకోవాలనే తొందర..వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. అయితే..అతి వేగానికి గమ్యం ఎప్పుడూ విషాదమే అవుతుందని చెబుతున్నా..డోంట్ కేర్ అంటున్నారు. వారంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాలను చూస్తే..ఇదే నిజం. రోడ్డు ప్రమాదాల్లో 55.7 ప్రమాదాలకు కారణం..అతివేగమేనని నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో గణంకాలు వెల్లడిస్తున్నాయి. రెండు నెలల్లో జరిగిన ఘోర ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబంలోని సభ్యులు మృత్యువాత పడుతుండగా..మృత్యుంజయులైన వారు జీవచ్చవాల్లా బతుకీడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కర్నూలు జిల్లా : –

కర్నూల్‌ జిల్లా వెల్దుర్తి వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో డ్రైవర్‌ నిద్రమత్తు, అతివేగం, రోడ్డు మలుపును గమనించకపోవడంతో చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన 14మంది మృతి చెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన వారు 12మంది ఉన్నారు. అతివేగంతోపాటు రోడ్డు మలుపును గమనించకపోవడమూ ప్రధాన కారణం.

నల్గొండలో తొమ్మిది మంది కూలీలు: –

జనవరి 22న నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలో జరిగిన ప్రమాదంలో తొమ్మిది మంది కూలీలు చనిపోయారు. మితిమీరిన వేగంతో కంటెయినర్ వాహనాన్ని నడుపుతున్నాడు డ్రైవర్. తన ముందున్న ఓ వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోతూ ఎదురుగా వస్తున్న కూలీల ఆటోను ఢీకొట్టాడు.

మహబూబాబాద్ జిల్లాలో : –

జనవరి 30న మహబూబాబాద్‌ జిల్లా గూగూరు మండలం మర్రిమిట్ట వద్ద జరిగిన ప్రమాదంలో పెళ్లి కూతురుతో సహా ఆరుగురు మృత్యువాత పడ్డారు. వీరంతా…పెళ్లి బట్టలు కొనేందుకు
వద్ద జరిగిన ప్రమాదంలో పెండ్లి బట్టలు కొనేందుకు వెళుతున్న పెండ్లి కూతురు సహా ఆరుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌కు ఆ ముందు రాత్రి నిద్రలేకపోవడం, ఆపై మద్యం మత్తులోనే లారీ నడపటం ఓ కుటుంబంలో తీరని విషాదానికి కారణమైంది.

13 మంది బాల్య స్నేహితులు: –

జనవరి 16న కర్ణాటకలోని ధార్వాడ నగర శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. వీరంతా బాల్యస్నేహితులు. వీరంతా మినీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ముందున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో…వస్తున్న టిప్పర్‌ వాహనాన్ని వేగంగా ఢీకొట్టాడు.

అరకు వద్ద లోయలో బస్సు : –

ఈ నెల 12న రాత్రి విశాఖలోని అరకు వద్ద బస్సు లోయలో పడిపోయింది. ఐదుగురు చనిపోయారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అదే బస్సు కండిషన్‌ ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుని ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.

కారు టైర్ పేలింది..స్టీల్ బెల్టుతో బయటపడ్డ దంపతులు : –

హైదరాబాద్‌లోని పటాన్‌చెరుకు చెందిన దంపతులు జయన్న (55), కల్యాణి (50)లు గురువారం కారులో కర్నూల్‌ నుంచి హైదరాబాద్‌ వస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి సమీపంలో..బైపాస్‌ రోడ్డు వద్ద కారు టైర్‌ పేలింది. దీంతో కారు బోల్తాపడింది. పల్టీలు కొడుతూ డివైడర్‌ పైకి ఎక్కింది. కారులో ఉన్న దంపతులు సీటు బెల్టు ధరించడం వల్ల స్వల్పగాయాలతో బయటపడ్డారు.

రోడ్డు ప్రమాదాలకు కారణాలు :-

అతి వేగం : 55.7%

నిర్లక్ష్యంగా నడపడం : 27.5%

వాతావరణ పరిస్థితులు : 3.2%

మద్యం, మత్తుపదార్థాలు : 1.9%

వాహనం ఫిట్‌నెస్‌లేకపోవడం : 1.3%

ఇతర కారణాలు : 10.3%

NCRB గణాంకాల ప్రకారం..2019 ప్రమాద మృతులు

టూ వీలర్ నడుపుతూ : 38%

ట్రక్కులు, లారీల వల్ల : 14.6%

కార్లు నడుపుతూ : 13.7%

బస్సుల్లో వెళుతూ : 5.9%

త్రీ వీలర్, ఆటో రిక్షాలు : 4.7%

ట్రాన్స్ పోర్టు వాహనాలు : 12.1%

పాదచారులు : 7.7%