విమానం ఎక్కేందుకు వచ్చి, గుండెపోటుతో వృధ్దురాలు మృతి

  • Edited By: murthy , July 5, 2020 / 12:25 PM IST
విమానం ఎక్కేందుకు వచ్చి, గుండెపోటుతో వృధ్దురాలు మృతి

హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విషాదం చోటు చేసుకుంది. సూడాన్ వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికురాలు గుండె పోటుతో మరణించింది. హైదరాబాద్ లో క్యాన్సర్ వ్యాధికి చికిత్స చేయుంచుకునేందుకు సూడాన్ కు చెందిన హుయిబా మహ్మద్ తాహా ఆలీ (62) ఏడు నెలల క్రితం హైదరా బాద్ వచ్చి చికిత్స పొందుతోంది.

ఆదివారం ఆమె సూడాన్ తిరిగి వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు వీల్ చైర్ లో విమానాశ్రయానికి తీసుకు వచ్చారు. మరి కొద్ది గంటల్లో ఆమె విమానం ఎక్కాల్సి ఉండగా వీల్ చెయిర్ లో ఆమె కుప్ప కూలి పోయింది. వెంటనే ఆమెను ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు.