Summer Trains : హైదరాబాద్-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ వివిధ ప్రాంతాల మధ్య   968 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

Summer Trains : హైదరాబాద్-తిరుపతి మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు

Summer Special Trains

Summer Trains :  వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే శాఖ వివిధ ప్రాంతాల మధ్య   968 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 30 నుంచి వారాంతాల్లో నడుస్తాయని రైల్వేశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.  వీటిలో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్- మన్మాడ్ మధ్య 126 ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.  దాదర్, మడ్గావ్ మధ్య మరో ఆరు వేసవి ప్రత్యేకరైళ్లు నడుస్తాయి. ఇక తిరుపతి-హైదరాబాద్‌, తిరుపతి-ఔరంగాబాద్‌ మధ్య 20 ప్రత్యేక రైళ్లు కూడా ఉన్నాయని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

07509 హైదరాబాద్-తిరుపతి రైలు శనివారం సాయంత్రం గం.4-35 కి హైదరాబాద్ లో బయలుదేరి మర్నాడు ఉదయం గం.5-30కి తిరుపతి చేరుకుంటుంది.  ఈ రైలు ఏప్రిల్ 30, మే 7, 14, 21, 28 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

Also Read : Prakasam District : ప్రకాశం జిల్లాలో మాచర్ల విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం
అదే విధంగా 07510 తిరుపతి-హైదరాబాద్ రైలు మంగళవారం మంగళవారం రాత్రి గం.11-50కి తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం గం.12-30కి హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మే 3, 10,17,24,31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.

07511 తిరుపతి-ఔరంగాబాద్ మధ్య మరో ప్రత్యేకరైలు నడుస్తోంది. ఈ రైలు ప్రతి ఆదివారం ఉదయం గం.07-05 లకు తిరుపతిలో బయలు దేరి మరుసటిరోజు ఉదయం గం. 7 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు మే 1, 8, 15, 22, 29 తేదీల్లో నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.