నాలుగు రోజుల్లో పెళ్లి, ఇంతలోనే.. కరోనాతో ప్రభుత్వ టీచర్ మృతి

కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. జీవితాలను చిన్నాబిన్నం చేస్తోంది. అయిన వారిని దూరం చేస్తోంది. కళకళలాడాల్సిన ఇళ్లను బోసిపోయేలా చేస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి ఓ ప్రభుత్వ టీచర్ ఇంట్లో తీరని విషాదం నింపింది. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన ఆ ఉపాధ్యాయుడు కోవిడ్‌కు బలయ్యాడు.

నాలుగు రోజుల్లో పెళ్లి, ఇంతలోనే.. కరోనాతో ప్రభుత్వ టీచర్ మృతి

Teacher Dies Of Corona In Sanga Reddy

కరోనావైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. జీవితాలను చిన్నాబిన్నం చేస్తోంది. అయిన వారిని దూరం చేస్తోంది. కళకళలాడాల్సిన ఇళ్లను బోసిపోయేలా చేస్తోంది. తాజాగా కరోనా మహమ్మారి ఓ ప్రభుత్వ టీచర్ ఇంట్లో తీరని విషాదం నింపింది. నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాల్సిన ఆ ఉపాధ్యాయుడు కోవిడ్‌కు బలయ్యాడు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలంలోని మన్యానాయక్‌ తండాలో ఈ విషాదం జరిగింది. కర్ర గణపతి చౌహాన్‌ (28) మెదక్‌ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌లో అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రభుత్వం ఉద్యోగం. ఇంకేముంది లైఫ్ లో సెటిల్ అయినట్టే అనే ఆనందంలో పెళ్లికి సిద్ధమయ్యాడు. కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాడు.

కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్ మెంట్ జరిగింది. మే 2న వివాహం జరగాల్సి ఉంది. అంతా ఆనందంగా ఉన్నారు. ఇంతలోనే విధి వక్రీకరించింది. కరోనా కాటేసింది. వారం కింద కరోనా లక్షణాలున్నాయని పరీక్షలు చేయించుకోగా గణపతికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. లక్షణాలు తీవ్రం కావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో కుటుంసభ్యులు చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గరపతి బుధవారం(ఏప్రిల్ 28,2021) మృతి చెందాడు.

గణపతి మృతితో అతటి కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగించింది మాయదారి కరోనా.