Teachers Issues: 317 జీఓ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల నిరసనలు, అరెస్ట్

317 జీఓను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు సోమవారం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ముట్టడికి వచ్చిన లెక్చరర్లు, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు

Teachers Issues: 317 జీఓ రద్దు కోరుతూ ఉపాధ్యాయుల నిరసనలు, అరెస్ట్

Untitled(6)(7)

Teachers Issues: ఉపాధ్యాయులు, ఉద్యోగుల హక్కులకు భంగం కలిగిస్తున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు కొనసాగుతున్నాయి. 317 జీఓ వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ తెలంగాణ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం బీఆర్కే భవన్ ముట్టడి నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు తొలుత కోరుకున్న జోన్లకు బదిలీలు ఇవ్వాలంటూ సోమవారం ఉదయం హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ కు చేరుకుని నిరసన చేపట్టారు. ఉపాధ్యాయుల మ్యూచువల్‌ బదిలీలకు అవకాశం కల్పిస్తూ 317 జీఓను రద్దు చేసి తమకు న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. ఈమేరకు జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్ ను కలిసిన ప్రధానోపాధ్యాయులు వినతి పత్రం సమర్పించారు.

Also read: Corona in Police: పోలీస్ శాఖను కలవరపెడుతున్న కరోనా

317 జీఓను రద్దు చేయాలంటూ ఉపాధ్యాయులు సోమవారం విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ముట్టడికి వచ్చిన లెక్చరర్లు, ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపుతప్పడంతో నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఇతర జోన్లకు బదిలీ అయిన 40 మంది ప్రధానోపాధ్యాయులు ఉమ్మడి సంగారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నారని ప్రధానోపాధ్యాయులు వాపోయారు.

Also read: Bhatti Vikramarka: కరోనాతో అపోలో హాస్పిటల్‌లో భట్టి విక్రమార్క

జీఏడీ నిబంధనల మేరకే బదిలీలు జరిగాయని అధికారులు తెలుపగా.. వాటిని రద్దు చేసి గతంలో తాము ఎంపిక చేసుకున్న జోన్లను పరిశీలించాలని ఉపాధ్యాయులు కోరారు. మరోవైపు ఉపాధ్యాయుల నిరసనలో భాగంగా ప్రగతి భవన్ ముట్టడించే అవకాశం ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఇతర జిల్లాల నుంచి వాహనాల్లో ఉపాధ్యాయులు నగరానికి చేరుకున్నట్లు ముందస్తు సమాచారం ఉండగా.. ప్రగతి భవన్ వైపు వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Also read: Hyderabad MMTS: హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైళ్లకు నేడూ బ్రేక్