Bandi Sanjay : కలిసి పోరాడదాం అంటూ షర్మిల‌ చేసిన ఫోన్ కాల్‌పై బండి‌ సంజయ్ హాట్ కామెంట్స్

షర్మిల ఫోన్ చేసింది, మాట్లాడింది వాస్తవం. అయితే, కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేసేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. (Bandi Sanjay)

Bandi Sanjay : కలిసి పోరాడదాం అంటూ షర్మిల‌ చేసిన ఫోన్ కాల్‌పై బండి‌ సంజయ్ హాట్ కామెంట్స్

Bandi Sanjay : నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడదాం అంటూ.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిలకు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఫోన్ కాల్ చేసి విషయం తెలిసిందే. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని, కలిసి పని చేద్దామని షర్మిల చేసిన ఫోన్ కాల్ పై బండి సంజయ్ స్పందించారు. హాట్ కామెంట్స్ చేశారు.

షర్మిల తనకు ఫోన్ చేసింది, మాట్లాడింది వాస్తవం అన్నారు బండి సంజయ్. షర్మిలకు ఇబ్బంది కలిగిన సమయంలో తాము మద్దతు తెలిపింది కూడా వాస్తవమే అన్నారు. అయితే, కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేసేది లేదని బండి సంజయ్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని ఆరోపించిన బండి సంజయ్.. కాంగ్రెస్ కలిసి వస్తే మేము రాము అని స్పష్టం చేశారు.(Bandi Sanjay)

”కాంగ్రెస్ తో కలిసి ఎలా పని చేస్తాం? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తో కలిసి పని చేస్తామని కాంగ్రెస్ ‌నాయకులే చెబుతున్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వస్తుంది. కొడుకు, బిడ్డ తప్పులు బయటపడతాయనే లిక్కర్ స్కామ్, టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ స్కామ్ పై కేసీఆర్ మాట్లాడటం లేదు.

Also Read..YS Sharmila: కలిసి పోరాడదాం.. బండి సంజయ్, రేవంత్ రెడ్డికి షర్మిల ఫోన్..

కేసీఆర్ ను.. పాస్ పోర్ట్ బ్రోకర్ అనటానికి సంస్కారం అడ్డొస్తోంది. పేపర్ లీకేజీ అంశంపై కలసి పోరాడదామన్న షర్మిల ప్రతిపాదనపై పార్టీలో చర్చిస్తాం. రైతుల‌ ఆత్మహత్యల్లో తెలంగాణ నంబర్ వన్. రైతుల గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ కు లేదు. 24 గంటల కరెంట్ ఇస్తామని రైతులను నిలువునా ముంచింది కేసీఆరే. రైతుబంధు ఇచ్చి రైతులకు అందాల్సిన ఇతర బెనిఫిట్స్ రాకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారు.(Bandi Sanjay)

సుఖేష్ చంద్రశేఖర్ అంశాన్ని డైవర్ట్ కోసం మహారాష్ట్ర నేతలను కేసీఆరే పిలిపించుకున్నారు. టీఎస్ పీఎస్ సీ కమిషన్ ను రద్దు చేయాలి. క్వశ్చన్ పేపర్ లీక్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. తప్పు చేయలేదన్న నమ్మకం ఉంటే సిట్టింగ్ జడ్డితో విచారణ ఎందుకు జరపటం లేదు. అన్నింట్లో తలదూర్చే కేటీఆర్ తన శాఖకు సంబంధించిన అంశాలపై మౌనం ఎందుకు వహిస్తున్నారు? 30లక్షల మంది జీవితాలతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. అప్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు.. కుప్పకూలే సర్కార్” అని బండి సంజయ్ అన్నారు.

కేసీఆర్ మెడలు వంచాలంటే ఏకం కావాల్సిందే-షర్మిల
కాగా.. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పాలి. షర్మిల.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. నిరుద్యోగుల సమస్యలపై కలిసి పోరాడుదామని వారిద్దరినీ ఆమె కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేద్దామని రేవంత్, సంజయ్ కి చెప్పారు.

Also Read..YS Sharmila : సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, ఒక్కొక్కరికి రూ.50వేలు ఇవ్వండి.. షర్మిల డిమాండ్

నిరుద్యోగుల సమస్యలు, టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై ప్రగతిభవన్ మార్చ్‌కు పిలుపునిద్దామని షర్మిల సూచించారు. కేసీఆర్ మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని అభిప్రాయపడ్డారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని షర్మిల అన్నారు.(Bandi Sanjay)

షర్మిలకు బండి సంజయ్ మద్దతు తెలిపారు. ఉమ్మడిగా పోరాటం చేసేందుకు త్వరలో సమావేశమవుదామని చెప్పారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు.