Babu Mohan : బీజేపీ కార్యకర్తపై బూతు పురాణంతో రెచ్చిపోయిన బాబూమోహన్..

మాజీ మంత్రి, బీజేపీ నేత, సినీ నటుడు బాబూమోహన్ ఓ బీజేపీ కార్యకర్తపై బూతు పురాణం అందుకున్న ఆడియో ఒకటి సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఏకంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నే బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫోన్ లో ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు బాబూమోహన్.

Babu Mohan : బీజేపీ కార్యకర్తపై బూతు పురాణంతో రెచ్చిపోయిన బాబూమోహన్..

telangana bjp leader babu mohan who spoke obscenely to BJp worker

telangana bjp leader babu mohan spoke obscenely : తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ పక్కాగా స్కెచ్ వేస్తోంది. ఈక్రమంలో మాజీ మంత్రి, బీజేపీ నేత, సినీ నటుడు అయిన బాబూమోహన్ ఓ బీజేపీ కార్యకర్తపై బూతు పురాణం అందుకున్న ఆడియో ఒకటి సోషల్ మీడియలో హల్ చల్ చేస్తోంది. ఏకంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నే బండి సంజయ్ ఎవడ్రా అంటూ ఫోన్ లో ఓ బీజేపీ కార్యకర్తపై రెచ్చిపోయారు బాబూమోహన్. ఆదోల్ నుంచి వెంకట రమణ అనే ఓ బీజేపీ కార్యకర్త బాబూమోహన్ కు ఫోన్ చేసి సార్ నేను మీతో కలిసి పార్టీ కోసం పనిచేద్దామనుకుంటున్నాను అన్నారు. దీంతో నువ్వెంత నీ బతుకెంత నాతో కలిసి పనిచేస్తావా? నేనెవరు నీకు తెలుసా? నేను ప్రపంచ స్థాయి నాయకుడిని..అటువంటి నాతో కలిసి పనిచేస్తావా? నువ్వెంత నీ బతుకెంత? మరోసారి ఫోన్ చేశావంటే చెప్పుతో కొడతా అంటూ రెచ్చిపోయారు.

బండి సంజయ్ ఎవడ్రా వాడు నా తమ్ముడు అంటూ నీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడు అంటూ అత్యంత హేయంగా తిట్ల పురాణం అందుకున్నారు. మధ్య మధ్యలో అశ్లీల పదజాలంతో బూతు పురాణం అందుకున్నారు. బీజేపీ కార్యకర్తపై బాబూమోహన్ చేసిన బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నేను మంత్రిగా ఉన్నప్పుడే ఆదోల్ ను అభివృద్ధి చేశా..నువ్వంతరా బచ్చాగాడివి నాకే ఫోన్ చేసి నాతో కలిసి పనిచేస్తానంటావా? అంటూ ఇష్టానురీతిగా రెచ్చిపోయారు బాబూమోహన్. పార్టీలో నేను కష్టపడి పనిచేశాను అందుకు అమిత్ షా అంతటి నేతే నన్ను బీజేపీలో చేర్చుకున్నారు అంటూ తన దర్పాన్ని ప్రదర్శించారు. ఇంకోసారి నాకు ఫోన్ చేస్తే చెప్పుతో కొడతానంటూ కార్యకర్తను హెచ్చరించారు. దీనికి సంబంధించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా బాబు మోహన్ బీజేపీలోనే ఉన్నా ఎక్కడా యాక్టివ్ గా లేరు.కనీసం పార్టీ కార్యక్రమాల్లో కూడా బాబూ మోహన్ పేరు వినిపించటంలేదు. సదరు బడా నేత అని గొప్పలు చెప్పుకునే సదరు నాయకుడు ఎక్కడా మచ్చుకు కూడా కనిపించటంలేదు. కనీసం బాబూమోహన్ పేరుకూడా వినిపించటంలేదు తెలంగాణ బీజేపీలో. అందోల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాబూమోహన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. కానీ బీజేపీలో పెద్ద యాక్టివ్ గా లేకపోయినా తాను మాత్రం ప్రపంచ స్థాయి నేతను అని చెప్పుకుంటూ ఓ సాధారణ కార్యకర్తపై బూతుల పురాణం అందుకోవటం సంచలనంగా మారింది.