Telangana Cabinet Meeting: కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ కేబినెట్
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అలాగే, నాలుగు కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వరంగల్, హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రూ.4 వేల కోట్ల రుణానికి కూడా ఆమోదముద్ర వేసింది.

Telangana Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అలాగే, నాలుగు కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం రుణానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వరంగల్, హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రూ.4 వేల కోట్ల రుణానికి కూడా ఆమోదముద్ర వేసింది.
భద్రాచలం, సారపాక, రాజంపేట గ్రామపంచాయతీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కాగా, రేపు అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెడతారు, ఎల్లుండి అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఫిబ్రవరి 8న బడ్జెట్ పై సాధారణ చర్చ జరుగుతుంది. అనంతరం మూడు రోజుల పాటు పద్దులపై చర్చ ఉంటుంది. 12న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు. దానిపై అదే రోజు చర్చ అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలుపుతుంది.
రేపు అసెంబ్లీలో మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెడతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కొన్ని నెలల్లో జరగనుండడంతో బడ్జెట్ లో ఏ వర్గం వారికి ఎన్ని కేటాయింపులు ఉంటాయన్న ఆసక్తి నెలకొంది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు వెళ్లారు. గురుద్వారాను దర్శించుకున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ సభ ప్రారంభం కానుంది.