Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు సీఎంతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.

Telangana : వరికి ప్రత్యామ్నాయంగా ఈ పంటలు వేసుకోవాలి

Tg Cm Kcr

Telangana CM KCR : వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రైతులకు సూచించారు. వరి వంటి ఒకే తరహా పంట వేసి..ఇబ్బందులు పడొద్దని…ఇతర పంటల సాగు మీద కూడా దృష్టి కేంద్రీకరించాలన్నారు. మార్కెట్ లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటలు వేసుకోవచ్చన్నారు. గత కొన్ని రోజులుగా వరి పంట విషయంలో దుమారం రేగుతోంది. ధాన్యం కొనమని FCI చేతులేత్తిసిందని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Omicron Variant : బెంగళూరులో ఒమిక్రాన్ కలకలం.. బాధిత వ్యక్తి నుంచి మరో ఐదుగురికి పాజిటివ్!

ఈ క్రమంలో…2021, డిసెంబర్ 02వ తేదీ గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లాకు వెళ్లిన కేసీఆర్.. తిరుగుప్రయాణంలో వనపర్తి జిల్లా రంగాపూర్, విలియం కొండ తండాలో రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మొదట రంగాపూర్ దగ్గర ఆగిన సీఎం కేసీఆర్ నడుచుకుంటూ వెళ్లి రైతు మహేశ్వర్‌ రెడ్డి సాగు చేస్తోన్న మినుము పంటను, మరో రైతు రాములు సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. మినుములు, వేరుశనగ దిగుబడి ఎంత వస్తుంది ? మార్కెట్లో ధర ఎంత ఉంది ? ఎన్ని తడులు నీళ్లు పెట్టాలి?  అని రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Read More : Rs 100 Home : రూ. 2 కోట్ల విలువైన ఇల్లు రూ.100కే అమ్మకం.. దంపతుల పెద్దమనస్సులో ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాల్సిందే..!

మినుములు ఎకరానికి 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని, కనీస మద్దతు ధర క్వింటాల్ కు 63 వందలు ఉండగా, మార్కెట్ లో ధర 8 వేలకు పైనే ఉందని రైతులు వివరించారు. వేరుశనగ పంట 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందని.. కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5 వేల 550 ఉందని, మార్కెట్ లో రూ. 7 వేలకు పైనే ఉందని సీఎంకు తెలిపారు రైతులు. అటు కొత్తకోట మండలం విలియంకొండ తండా రోడ్డు దగ్గర  కళ్లంలో ఆరబోసిన ధాన్యాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. అనంతరం గోకరి వెంకటయ్య అనే రైతు సాగుచేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు.

Read More : IIT Team : ఘాట్ రోడ్డులో ప్రమాదకరమైన పరిస్థితులు – ఐఐటీ బృందం హెచ్చరికలు

సాగు విధానం, దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని వేరుశనగ చెట్లను భూమి నుండి తీసి వేరుశనగ కాయలను పరిశీలించారు. నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండడంతో పంటల దిగుబడి బాగా పెరిగిందని రైతు వెంకటయ్య సీఎంకు వివరించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని  ఆదేశించారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు సీఎంతో ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపించారు.