Telangana Corona : తెలంగాణలో కరోనా విజృంభణ.. 2వేలకు చేరువలో కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర రీతిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ కేసులు

Telangana Corona : తెలంగాణలో కరోనా విజృంభణ.. 2వేలకు చేరువలో కొత్త కేసులు

394 Corona Cases Registered In A Single Day Across Telangana 1

Telangana Corona : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఆందోళనకర రీతిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రోజు వారీ కేసులు 2వేలకు చేరువలో ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. నిన్న(ఏప్రిల్ 6,2021) రాత్రి 8గంటల వరకు 74వేల 274 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

రాష్ట్రంలో మరో ఐదుగురు కరోనాతో మరణించారు. కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,734కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,299కి చేరింది. ప్రస్తుతం 11వేల 617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 6వేల 634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం(ఏప్రిల్ 7,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

ఏపీలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి:
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తగా రాష్ట్రంలో 31వేల 657 నమూనాలను టెస్ట్ చేయగా.. 1,941 మందికి కొవిడ్‌ సోకినట్లు తేలింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్-19 కేసుల సంఖ్య 9,10,943కి చేరింది. 24 గంటల వ్యవధిలో 835 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11వేల 809 యాక్టివ్ కేసులున్నాయి.

కొవిడ్‌ కారణంగా మరో ఆరుగురు మృతి చెందారు. ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున.. చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్‌తో మృతిచెందిన వారి సంఖ్య 7,251కి చేరింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 424 మంది వైరస్ బారినపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లాలో అత్యల్పంగా 25 మందికి వైరస్ సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం(ఏప్రిల్ 6,2021) బులిటెన్ విడుదల చేసింది.

కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

దేశంలో కరోనా ఉగ్రరూపం..ప్రమాదకరంగా వ్యాప్తి..రెండోసారి లక్ష మార్క్ దాటింది:
దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాల్చింది. మరోసారి రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 12లక్షల 08వేల 329 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..లక్షా 15వేల 736 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం మొట్టమొదటిసారిగా రోజూవారీ కేసులు లక్ష మార్కు(1,03,558)ను దాటాయి. తాజాగా మరోసారి అంతకుమించిన కేసులు నమోదయ్యాయి. నిన్న(ఏప్రిల్ 6,2021) మరణాల సంఖ్యలో కూడా భారీ పెరుగుదల కనిపించింది. 630 మంది కరోనాకు బలయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం(ఏప్రిల్ 7,2021) వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం 1.28 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా.. 1,66,177 మంది ప్రాణాలు కోల్పోయారు.

8లక్షల 43వేల యాక్టివ్ కేసులు:
కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో.. యాక్టివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8లక్షల 43వేల 473(6.21శాతం) మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇక, కొవిడ్‌బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉంటుంది. నిన్న ఒక్కరోజే 59వేల 856 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1,17,92,135 మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 92.48 శాతానికి పడిపోయింది.

ఒక్క మహారాష్ట్రలోనే 55వేలకు పైగా కేసులు:
ఇక మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 55 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో ఈ రాష్ట్రం నుంచే ఎక్కువ శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది.