Starved to Death: కొడుకు.. కోడలు పట్టించుకోక ఆకలితో చనిపోయిన దంపతులు

కని.. పెంచి.. పోషించి వ్యక్తిగా మార్చిన తల్లిదండ్రులకు తిండి పెట్టడం మానేయడంతో ఆ దంపతులు ఆకలితో చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. బాధ్యులైన నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మీని పోలీసులు..

Starved to Death: కొడుకు.. కోడలు పట్టించుకోక ఆకలితో చనిపోయిన దంపతులు

Starved to Death

Starved to Death: కని.. పెంచి.. పోషించి వ్యక్తిగా మార్చిన తల్లిదండ్రులకు తిండి పెట్టడం మానేయడంతో ఆ దంపతులు ఆకలితో చనిపోయారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘటన సోమవారం వెలుగు చూసింది. బాధ్యులైన నాగేశ్వర్ రెడ్డి, లక్ష్మీని పోలీసులు అరెస్టు చేశారు. హత్య చేయకపోయినా చనిపోయేందుకు కారణమయ్యారని ప్రాథమిక విచారణలో తెలిసింది.

సూర్యాపేట పోలీసులు నల్లు రామచంద్రా రెడ్డి (90), అనసూయమ్మ (80)లు మే 27న మృతి చెందారు. అదే రోజున కొడుకు మోతె మండలంలోని తుమ్మగూడెం గ్రామంలో పూర్తి చేశారు. అనుమానం కలగడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను బలవంతంగా బయట ఉనన గుడిసెలో ఉండేలా తోసేశారు. ఇద్దరు కొడుకులు ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు వారి బాధ్యతలు చూసుకోవాలని నిర్ణయించారు. వాళ్ల చిన్న కొడుకు చనిపోవడంతో బాధ్యత మొత్తం పెద్ద కొడుకుపైనే జరిగింది.

స్థానికులు నాగేశ్వర్ రెడ్డి ఎటువంటి కేరింగ్ తీసుకోలేదని చెప్పారు. అంతేకాకుండా ఆహారం, మంచి నీరు ఇవ్వడానికి కూడా నిరాకరించారు. ఆ కారణం చేతనే ఆకలితో చనిపోయారని భావిస్తూ.. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

పోస్టు మార్టం రిపోర్టు అందుకున్న తర్వాతే వారిపై కేసు బుక్ చేశాం. సెక్షన్ 304ప్రకారం.. కేసు బుక్ చేసి 15రోజుల రిమాండ్ అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నామని పోలీసులు తెలిపారు.