Telangana Governor Vs CS shanthi kumari : ‘ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉంది’ అంటూ తెలంగాణ సీఎస్‌కు గవర్నర్ తమిళిసై కౌంటర్

‘ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉంది’ అంటూ తెలంగాణ సీఎస్‌కు గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు.గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై తనదైన శైలిలో స్పందిస్తూ..‘ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంది’ అంటూ సీఎస్‌కు కౌంటర్ ఇచ్చారు.

Telangana Governor Vs CS shanthi kumari : ‘ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గరగా ఉంది’ అంటూ తెలంగాణ సీఎస్‌కు గవర్నర్ తమిళిసై కౌంటర్

telangana governor tamilisai Counter on telangana chief secretary shanthi kumari

Telangana Governor Vs CS shanthi kumari : ‘ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంది’ అంటూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకు గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా సీఎస్ శాంతికుమారికి కౌంటర్ ఇచ్చారు తమిళిసై. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులను వెంటనే ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై తనదైన శైలిలో స్పందిస్తూ..‘ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరగా ఉంది’ అంటూ సీఎస్‌కు కౌంటర్ ఇచ్చారు.

సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత శాంతికుమారి అధికారికంగా రాజభవన్ కు సందర్శించలేదని..కనీసం ఫోన్ లో మాట్లాడటానికి కూడా ఆమెకు సమయంలేదంటూ ఎద్దేవా చేశారు. ప్రోటోకాల్ పాటించలేదంటూ మండిపడ్డారు. తెలంగాణ గవర్నమెంట్ కు గవర్నర్ తమిళిసైకు మధ్య వివాదం గత అసెంబ్లీ సమావేశాల తరువాత సమసిపోయిందనుకుంటే అది మరింతగా రగులుతున్నట్లుగా తెలుస్తోంది పెండింగ్ బిల్లల గురించి తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేయటం చూస్తే. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన మరునాడే సీఎస్ శాంతికుమారిపై గవర్నర్ ఫైరయ్యారు. ట్విట్టర్ వేదికగా సీఎస్ పై విమర్శలు సంధించారు.

Governor Tamilisai-Telangana Govt : పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్..గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసైని ప్రతివాదిగా చేర్చిన ప్రభుత్వం

తెలంగాణ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శాంతికుమారి రాజ్ భవన్ కు రాలేదని..కనీసం మర్యాద కోసం ఫోన్ లో మాట్లాడని విషయాన్ని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మర్యాదపూర్వకంగా పిలిచినా మర్యాద పాటించటంలేదన్నారు. స్నేహపూర్వకంగా అధికారిక సందర్శనలు పరస్పర చర్యలు సహాయకారిగా ఉంటాయని వ్యాఖ్యానించిన గవర్నర్ తమిళిసై రాజ్ భవన్ సందర్శించటానికి కూడా సమయం దొరకనంత బిజీగా సీఎస్ ఉన్నారంటూ కౌంటర్ ఇచ్చారు. చర్చించకుంటే ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు..కానీ అటువంటి పరిష్కారాలు మీకు అవసరం లేనట్టుగా ఉందని అన్నారు తెలంగాణ గవర్నమెంట్ ను ఉద్ధేశిస్తూ.ఈ క్రమంలోనే రాజ్ భవన్ దగ్గరగానే ఉంది ఢిల్లీ కంటే అంటూ మరోసారి గుర్తు ట్వీట్ చేశారు తమిళిసై.

కాగా తెలంగాణ గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని..వాటికి ఆమోదం తెలిపేలా గవర్నర్ తమిళిసైకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సీఎస్ శాంతికుమారి గురువారం (మార్చి 2,2023) పిటీషన్ దాఖలు చేశారు. దీనికి ప్రతివాదిగా తమిళిసై పేరును చేర్చారు. ఉద్దేశ్యపూర్వకంగానే గవర్నర్ తన వద్ద బిల్లులను పెండింగ్ లో పెట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ విషయంలో గవర్నర్ తీరుపై ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. ఈ 10 బిల్లులను ఆమోదించేలా గవర్నర్ కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రభుత్వం రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గవర్నర్ ట్విట్టర్ వేదికగా సీఎస్ కు కౌంటర్ ఇచ్చారు.

 

గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు
1) తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు
2) ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసే బిల్లు
3) ఆజమాబాద్‌ ఇండస్ట్రియల్‌ ఏరియా చట్ట సవరణ
4) మున్సిపల్‌ చట్ట సవరణ
5) పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ
6) ప్రైవేటు యూనివర్సిటీ సవరణ బిల్లు
7) మోటర్‌ వెహికిల్‌ టాక్సేషన్‌ సవరణ బిల్లు
8) మున్సిపల్ చట్ట సవరణ -2
9) పంచాయితీ రాజ్ చట్ట సవరణ-2
10) అగ్రికల్చర్ యూనివర్సిటీ


Community-verified icon