Common Entrance Tests: మే 7న తెలంగాణ ఎంసెట్… 18న ఎడ్ సెట్.. ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

తెలంగాణలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలను ఇవాళ విద్యాశాఖ విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ మే 7 నుంచి ప్రారంభమై 14 వరకు కొనసాగుతుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరుగుతాయి. అలాగే, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు మే 12 నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Common Entrance Tests: మే 7న తెలంగాణ ఎంసెట్… 18న ఎడ్ సెట్.. ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

Common Entrance Tests: తెలంగాణలో పలు కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలను ఇవాళ విద్యాశాఖ విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ మే 7 నుంచి ప్రారంభమై 14 వరకు కొనసాగుతుంది. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు మే 7 నుంచి 11 వరకు జరుగుతాయి. అలాగే, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు మే 12 నుంచి 14 వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

ఇక, బీఈడీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌ సెట్‌ మే 18 జరగనుంది. ఈ సెట్‌ (ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)-మే 20న, పీజీ లా సెట్‌, పీజీఎల్‌ సెట్-మే 25న నిర్వహిస్తారు. టీఎస్‌ ఐసెట్‌ (తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)-మే 26, 27 తేదీల్లో, టీఎస్‌పీజీ ఈ సెట్‌ (తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)-మే 29 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయి.

కాగా, ఆయా ప్రవేశ పరీక్షల నిర్వహణపై సంబంధిీత అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. పరీక్షలను ఎటువంటి ఆటంకాలు లేకుండా, విద్యార్థులకు అసౌకర్యాలు కలగకుండా నిర్వహించాలని చెప్పారు.

BRS MLAs Poaching Case: సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా?: డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ను ప్రశ్నించిన హైకోర్టు