తెలంగాణాలో డిజిటల్ బెగ్గింగ్ : ఫోన్‌పే, గూగుల్ పే ల్లో ధర్మం చేయండీ సార్..

తెలంగాణాలో డిజిటల్ బెగ్గింగ్  : ఫోన్‌పే, గూగుల్ పే ల్లో ధర్మం చేయండీ సార్..

Telangana Tribes In Mahabubabad Begging Money Using Phonepe Paytm And Google Pay1

Digital begging in Telangana : ఇప్పుడంతా డిజిటల్. డబ్బులు తీసుకోవాలన్నా..ఇవ్వాలన్నా అంతా ఆన్ లైన్ లోనే. ఈ డిజిటల్ ఏ స్థాయికి వెళ్లిందంటే యాచకులు కూడా ‘డిజిటల్ బెగ్గింగ్’ చేసేంతగా. ఇంతకు ముందు భిక్షగాళ్లు..‘‘బాబయ్యా..కాస్త చిల్లరుంటే ధర్మం చేసి పుణ్యం కట్టుకోండి బాబయ్యా’’అంటూ అడుక్కునేవారు. కానీ ఇది డిజిటల్ టైమ్ కదా..బెగ్గింగ్ కూడా డిజిటల్ అయిపోయింది. ‘‘సార్..చిల్లర లేదా..ఏం పర్లేదు..ఫోన్‌పే, గూగుల్ పే చేయండి సార్’’అంటూ అడుక్కుంటున్నారు. ఇటువంటి దృశ్యాలు ఏ విదేశాల్లోను చూసి ఉంటాం. కానీ ఇప్పుడీ డిజిటల్ బెగ్గింగ్ విధానం మన తెలంగాణాలో కూడా వచ్చేసిందండోయ్..గిరిజన ప్రాంతాలకు చెందిన కొంద‌రు యాచ‌కులు క్యాష్‌లెస్ మోడ్‌లో అడుక్కుంటున్నారు. జేబులో డబ్బులు లేకపోతే డిజిటల్ విధానంలో పంపించమని క్యూ ఆర్ కోడ్ చూపించి మరీ యాచిస్తున్నారు.

Digital Begging In Telangana

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో కొంతమంది యాచకులు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం చేయమని డబ్బులు అడుగుతున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. క్యూఆర్ కోడ్ బోర్డును చేతిలో పట్టుకొని మరీ భిక్షాటన చేస్తున్నారు. చిల్లర లేదని చెప్పొద్దు సార్.. మీకు తోచినంత ‘స్కాన్ చేసి’ పంపించండి అంటూ అడుక్కుంటున్నారు. మ‌హ‌బూబాబాద్ జిల్లా డోర్న‌క‌ల్ మండ‌లం పెరుమాండ్ల‌, సంకీస గ్రామంలో ఈ దృశ్యాలు కనిపించాయి. గిరిజన ప్రాంతాలకు చెందిన కొంద‌రు యాచ‌కులు క్యాష్‌లెస్ మోడ్‌లో ఇలా డిజిటల్ విధానంలో అడుక్కుంటూ ఓ ఫోటో గ్రాఫర్ కళ్లకు చిక్కటంతో క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఆ ఫోటో వైరల్ గా మారింది.

12

జేబులో డబ్బులు లేకపోతే డిజిటల్ విధానంలో పంపించమని..ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే.. అన్నీ అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు. స్కాన్ చేసి.. క్లిక్ చేశారంటే.. నేరుగా మా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతాయనని అంటున్నారు. వీరి చేతిలో క్యూర్ కోడ్స్ చూసి వాళ్లు షాక్ అవుతున్నారు. ఇదే మరి కంప్యూటర్ కాలం అంటే అంటున్నారు. గతంలో బయటకు వెళ్లాలంటే జేబులో డబ్బులు ఉన్నాయో లేదో చూసుకుని వెళ్లేవారు.

China

ఛైనాలో ఎప్పుడో మొదలైన డిజిటల్ బెగ్గింగ్

కానీ ఇప్పుడు జేబులో డబ్బులు లేకపోయినా..ఏం ఫరవాలేదు. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఏదైనా కొనొచ్చు. రోడ్డుపక్కన చెప్పుల కుట్టేవారి నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అందరూ డిజిటల్ పేమెంట్సే. ఏం కావాలన్నా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం చేసి.. తమకు కావాల్సిన వస్తువులు కొనేస్తున్నారు. పట్టణాల్లోనే కాదు..చిన్న చిన్న పల్లెటూర్లలోనూ డిజిటల్ పేమెంట్సే నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే యాచకులు కూడా డిజిటల్ భిక్షాటనకు శ్రీకారం చుట్టి తమ వృత్తిని డిజిటల్ బెగ్గింగ్ లా కొనసాగిస్తున్నారు.