PM Modi Telangana Tour: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ.. ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం.. రెండు చోట్ల సభల్లో ప్రసంగం

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు తెలంగాణలో పర్యటనకు రానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రైల్వేలైన్, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ప్రధాని రాక సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. రెండు చోట్ల ప్రధాని సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు.

PM Modi Telangana Tour: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ.. ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం.. రెండు చోట్ల సభల్లో ప్రసంగం

PM Modi

PM Modi Telangana Tour: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నేడు తెలంగాణలో పర్యటనకు రానున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేయడంతో పాటు రైల్వేలైన్, జాతీయ రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ప్రధాని రాక సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. రెండు చోట్ల ప్రధాని సభల్లో పాల్గొంటారు. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయంలో స్వాగత సభలో, తర్వాత రామగుండం బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. రామగుండం వద్ద జరిగే బహిరంగ సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

Pawan Kalyan PM Modi Meeting : ఏపీలో మంచి రోజులు వస్తాయి -ప్రధానితో భేటీ తర్వాత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ఎన్టీపీసీ టౌన్షిప్ లోని మహాత్మాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. ఇప్పటికే బాంబ్ స్వ్కాడ్ బృందం వేదిక వద్ద తనిఖీలు చేపట్టింది. సభా ప్రాంగణంలోనూ పరిశీలించారు. నిఘా కెమెరాలతో పాటు ప్రజలు వీక్షించేందుకు భారీ స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ హెలిప్యాడ్ లో ప్రసంగం కోసం వేదికతో పాటు మూడు సభా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. ప్రధాని బందోబస్తులో భాగంగా పది జిల్లాల పోలీసు బలగాలు సుమారు 3వేల మంది పాల్గోనున్నారు.

PM Modi Visakhapatnam : విశాఖ చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన గవర్నర్, సీఎం జగన్

ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అగ్రనేతలు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. అనంతరం విమానాశ్రయానికి చేరుకొనే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ 20 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2గంటలకు బేగంపేట విమనాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. 3.05 గంటలకు రామగుండం ఎన్టీపీసీలో హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 3.10 గంటలకు హెలిప్యాడ్ నుంచి ఆర్ఎఫ్సీఎల్ కు బయలుదేరుతారు. మధ్యాహ్నం 3.20 గంటలకు ఆర్ఎఫ్సీఎల్ కు చేరుకుంటారు. 3.35గంటలకు ఆర్ఎఫ్సీఎల్ నుంచి బయలుదేరి 3.45 గంటలకు ఎన్టీపీసీ క్రీడా మైదానం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. 3.45 గంటల నుంచి 4.40 గంటల వరకు శిలాఫలకాల ఆవిష్కరణ, ఆర్ఎఫ్సీఎల్ జాతికి అంకితం ప్రకటన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 4.45 గంటలకు సభా వేదిక నుంచి బయలుదేరి 4.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.