TPCC : నేడే టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన ?

టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2021, జూన్ 12వ తేదీ శనివారం ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో మకాం వేశారు.

TPCC : నేడే టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన ?

Tpcc Chief Selection Announcement Today

TPCC Chief Selection : ఎప్పటిగానో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. 2021, జూన్ 12వ తేదీ శనివారం దీనిపై ఓ ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలో మకాం వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ లో సీనియర్ నేతలుగా ముద్రపడిన మధు యాష్కీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలు హస్తినలోనే ఉన్నారు.

పీసీసీ చీఫ్ కోసం పోటా పోటీ లాబీయింగ్ నడుస్తోంది. పీసీసీ చీఫ్ దాదాపు ఖరారు చేశారని..అనే హామీతో ఓ నేత ఫ్యామిలీతో ఢిల్లీకి పయనమయ్యారని సమాచారం. మొత్తంగా శనివారం రాత్రి వరకు పీసీసీ ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎన్నో రోజులుగా టీపీసీసీ చీఫ్ ఎంపిక ప్రకటన పెండింగ్ పడుతూ వస్తోంది. హై కమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం వెలువడించకపోతుండడంతో నేతలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తమను ఎంపిక చేయాలంటూ..లాబీయింగ్ కూడా చేపట్టారు. ఎవరికి వారే..ప్రకటనలిస్తూ..గందరగోళానికి తెరతీశారు. పార్టీ హైకమాండ్ ఎవరి పేరూ ప్రకటించకముందే పీసీసీ తమదంటే తమదేనని ఎవరికి వారు ప్రకటనలు ఇచ్చేస్తున్నారు.

పీసీసీ చీఫ్‌ పదవి తనకే వచ్చే అవకాశముందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇటీవలే నిర్వహించిన సత్యాగ్రహ దీక్షలో టీపీసీసీ రచ్చ అయ్యింది. తనకు పీసీసీ ఇస్తే.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెంకట్‌రెడ్డి వెల్లడించారు. పీసీసీ విషయంలో తనన కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పినా.. పార్టీ నేతలెవరూ పట్టించుకోవడం లేదని సీనియర్ నేత హన్మంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. మరి టీపీసీసీ చీఫ్ ఎవరు అవుతారో ? హై కమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.

Read More : Crazy lover : పానీపూరీలో ఉంగరం పెట్టి..లవ్ ప్రపోజ్..