Vehicle Seize : వాహనదారులకు బిగ్ రిలీఫ్.. ఆ అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు

వాహనదారులకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చే వార్త చెప్పింది. పెండింగ్ చలానాలున్న వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పి

Vehicle Seize : వాహనదారులకు బిగ్ రిలీఫ్.. ఆ అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదు

Vehicle Seize

Vehicle Seize : వాహనదారులకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చే వార్త చెప్పింది. పెండింగ్ చలానాలున్న వాహనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. చట్టప్రకారం వాహనాలు సీజ్ చేయడానికి వీల్లేదంది. వాహనాలపై ఒక్క పెండింగ్ చలాన్ ఉన్నా సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు ఇటీవల చెప్పగా, వాహనదారులు రోడ్డుపైకి వెళ్లాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు జారీచేసిన మార్గదర్శకాలు వాహనదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి.

ఒక చలానా పెండింగ్ లో ఉందని కూకట్ పల్లికి చెందిన ఓ లాయర్ బైక్ ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాహనదారుడు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చట్టప్రకారం వాహనం సీజ్ చేయడానికి వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. వాహనాన్ని సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు లేదంది. అంతేకాదు వాహనాన్ని తిరిగి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

న్యాయవాదిగా పనిచేస్తున్న నిఖిలేష్ ఆగస్టు 1న బైక్ పై వెళ్తుండగా పర్వత్ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఆ బైక్ పై రూ.1635 చలానా పెండింగ్ ఉందని, చెల్లించాలని కోరారు. అందుకు నిఖిలేష్ నిరాకరించడంతో వాహనాన్ని సీజ్ చేశారు. బైక్ ఎలా సీజ్ చేస్తారని నిఖిలేష్ ప్రశ్నించగా, రూల్స్ ప్రకారమే సీజ్ చేశామని పోలీసులు వివరణ ఇచ్చారు. ఒక్క చలానా పెండింగ్ లో ఉన్నా వాహనం సీజ్ చేస్తామని వివరించారు. ఈ ఘటనతో వాహనదారులు వణికిపోయారు. ఆ తర్వాత నిఖిలేష్ కోర్టుని ఆశ్రయించడం, బండిని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని కోర్టు చెప్పడం జరిగాయి.