Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఆ వాహనాలు కొనుగోళ్లపై 20శాతం డిస్కౌట్‌..

Telangana Govt : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురాబోతున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్)లు కొనుగోలుచేస్తే 20శాతం డిస్కౌట్ ఇస్తామని ప్రకటించారు.

Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ఆ వాహనాలు కొనుగోళ్లపై 20శాతం డిస్కౌట్‌..

Electric Vehicle

Updated On : January 7, 2026 / 7:10 AM IST
  • ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆఫర్
  • ఈవీలపై 20శాతం డిస్కౌట్ ఇస్తామని వెల్లడి
  • ప్రభుత్వ వెహికల్స్‌లోనూ ఈవీల సంఖ్య పెంచుతామన్న పొన్నం

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఈవీ (ఎలక్ట్రిక్ వాహనాల) వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాబోయే రోజుల్లో రవాణా వ్యవస్థలో భారీ మార్పులు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్)లు కొనుగోలుచేస్తే 20శాతం డిస్కౌట్ ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

Also Read : Kavitha: కవిత రాజీనామాకు ఆమోదం.. తెలంగాణలో మరో ఉపఎన్నిక ఖాయం..?

ప్రభుత్వం వాడే వాహనాల్లో కూడా 20 నుంచి 30శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ ఉండేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం తెలిపారు. రాబోయే తరానికి మంచి జీవితంకోసం జీవో 41 ద్వారా ఈవీ పాలసీ తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వంపై 900 కోట్ల భారం పడుతున్నప్పటికీ ఈవీ పాలసీని అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో గతంలో 0.3శాతం ఉన్న ఈవీ సేల్స్ ఇప్పుడు 2శాతానికి పెరిగాయని మంత్రి చెప్పారు.

ఏడాది కాలంలో లక్ష ఈవీలు అమ్ముడు పోయాయి. గతంలో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 15 కి.మీ ప్రయాణించే కెపాసిటీ ఉన్న ఈవీలు ఇప్పుడు 500 కి.మీ ప్రయాణించే కెపాసిటీకి చేరాయి. కార్యాలయాలు, గ్రేటర్ కమ్యూనిటీ హాల్‌లు, విద్యాలయాల వద్ద కూడా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేలా చర్యలు జరుగుతున్నాయని మంత్రి పొన్నం తెలిపారు.

Ponnam Prabhakar

రాష్ట్ర ప్రభుత్వ వాహనాలతోపాటు పాఠశాల బస్సులు, ఫార్మా, ఐటీ వాహనాలు 25 నుంచి 50శాతం వారి అవసరాలను బట్టి ఈవీలు కొనేలా విధానం తీసుకురాబోతున్నామని మంత్రి పొన్నం చెప్పారు. ఈవీల వినియోగంలో దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్‌గా ఉండాలి. రాబోయే తరానికి కాలుష్య రహిత తెలంగాణను అందించాలని మంత్రి సూచించారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తీవ్రంగా ఉందని, హైదరాబాద్ లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఈవీలు, సీఎన్జీ, ఎల్పీజీ వాహనాల వినియోగం పెంచుతున్నామని చెప్పారు.

ప్రభుత్వం ఆర్టీసీలో 570 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని, త్వరలో 2వేల బస్సులు రాష్ట్రానికి రానున్నాయని, ఇందులో 100 బస్సులను వరంగల్ కు, 50 బస్సులను నిజామాబాద్ కు ఇవ్వనున్నామని మంత్రి చెప్పారు. 15ఏళ్లు దాటిన ఆర్టీసీ బస్సులను స్ర్కాప్ కు తరలిస్తున్నట్లు ప్రకటించారు.