Bajireddy Govardhan : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్ నియామకం అయ్యారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ను ఆర్టీసీ చైర్మ‌న్‌గా సీఎం కేసీఆర్ నియ‌మించారు.

Bajireddy Govardhan : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

Bajireddy

TSRTC Chairman Bajireddy : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం అయ్యారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ను ఆర్టీసీ చైర్మ‌న్‌గా సీఎం కేసీఆర్ నియ‌మించారు. ప్ర‌స్తుతం బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ నిజామాబాద్ రూర‌ల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. త‌న‌ను ఆర్టీసీ చైర్మ‌న్‌గా నియమించిన సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్ ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సిరికొండ మండ‌లం రావుట్ల‌లో బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్‌ జ‌న్మించారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో కీల‌క నేత‌గా ఎదిగారు. టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున 2014, 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన గోవ‌ర్ద‌న్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో ఆర్మూర్ నుంచి, 2004లో బాన్సువాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందారు.

Sajjanar : ఆర్టీసీ ప్రైవేటీకరణపై ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

గోవ‌ర్ద‌న్ 1973లో పోలీస్ పటేల్‌గా పని చేశారు. 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తరువాత 1986లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1986లో ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యారు. 1994లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్ధిగా పోటి చేసి ఓడిపోయారు.