Inter 2nd Year Results : రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

Inter 2nd Year Results : రేపు ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల

Inter Results

Inter 2nd Year Results :తెలంగాణ ఇంటర్మీడియేట్ సెకండియర్ ఫలితాలను  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది.

ఈమేరకు ఫలితాల వెల్లడికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. వాటికి అనుగుణంగా రేపు ద్వితీయ సంవత్సరం ఫలితాలను మంత్రి విడుదల చేస్తారు. ఆయా సబ్జెక్టుల్లో మొదటి సంవత్సరం మార్కులనే ద్వితీయ సంవత్సరానికి కేటాయించనున్నారు. ఇంటర్ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్ కు పూర్తి మార్కులు ఇవ్వనున్నారు.

గతంలో ఫెయిల్ అయిన  సబ్జెక్టులకు 35 శాతం మార్కులను, బ్యాక్‌లాగ్స్ ఉంటే ఆ సబ్జెక్ట్‌లకు రెండో ఏడాది 35 మార్కులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.  ఫలితాలతో   సంతృప్తి   చెందని విద్యార్ధులకు కోవిడ్  పరిస్ధితులు మెరుగయ్యాక   ప్రత్యేకంగా పరీక్షలు నిరహిస్తామని ఇంటర్మీడియేట్  బోర్డు అధికారులు తెలిపారు.