Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు.. సిట్ కస్టడీకి నలుగురు నిందితులు.. సిట్ ముందుకు బండి సంజయ్ లీగల్ టీం

ఏ1-ప్రవీణ్, ఏ2-రాజశేఖర్, ఏ4-డాక్య, ఏ5-కేతావత్ రాజేశ్వర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ భావిస్తోంది. కోర్టు అనుమతి మేరకు నలుగురు నిందితులను ఆదివారం కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది.

Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు.. సిట్ కస్టడీకి నలుగురు నిందితులు.. సిట్ ముందుకు బండి సంజయ్ లీగల్ టీం

Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ (TSPSC) పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. దీనిలో భాగంగా నలుగురు నిందితులను నేడు సిట్ కస్టడీలోకి తీసుకోనుంది. ఏ1-ప్రవీణ్, ఏ2-రాజశేఖర్, ఏ4-డాక్య, ఏ5-కేతావత్ రాజేశ్వర్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని సిట్ భావిస్తోంది.

PM Modi: మోదీ పర్యటనలో భద్రతాలోపం.. కాన్వాయ్‌వైపు దూసుకొచ్చిన వ్యక్తి.. వైరల్ వీడియో

కోర్టు అనుమతి మేరకు నలుగురు నిందితులను ఆదివారం కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు సిట్ సిద్ధమైంది. గత దర్యాప్తులో పూర్తి వివరాలు చెప్పలేదని, ముగ్గురి పేర్లు మాత్రమే చెప్పారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి సిట్.. బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సాక్షాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ, సిట్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. సిట్ ఎదుట తాను హాజరుకానని, సిట్‌పై తనకు నమ్మకం లేదని బండి సంజయ్ అన్నారు. అయినప్పటికీ తన అభిప్రాయం చెప్పేందుకు బండి సంజయ్ లీగల్ టీం ఆదివారం ఉదయం సిట్ ఆఫీసుకు వెళ్లనుంది. ఈ విషయంలో బండి సంజయ్ సిట్‌కు సమాధానం ఇచ్చారు.

ISRO: ఎల్‌వీఎమ్3 రాకెట్ ప్రయోగం విజయవంతం.. 36 ఉపగ్రహాలతో దూసుకెళ్లిన రాకెట్

‘‘నాకు సిట్ మీద నమ్మకం లేదు. పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్నాను అని ఇప్పటికే చెప్పా. అయినా మళ్ళీ నోటీస్‌లు ఇచ్చారు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఆ బాధ్యత గల మంత్రి ఈ కేసులో ఇద్దరు మాత్రమే నిందితులు ఉన్నారు అని అన్నారు. లీక్‌లో చాలా మంది ఉన్నారని సిట్ హెడ్‌గా మీకు తెలుసు. స్కాంను తక్కువ చేసి చూపించే ప్రయత్నం మొదటి నుంచే జరుగుతోంది. రాజకీయాలను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షితో ఆలోచించండి. ఈ స్కాంతో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారు. ఒక గ్రామం నుంచి ఎక్కువ మంది గ్రూప్ వన్‌కి సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చింది. దాన్ని ప్రజల ముందు పెట్టాను. ప్రజా ప్రతినిధిగా వివిధ మార్గాల నుంచి సమాచారం వస్తుంది.

ఈ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నా. అసలు విషయంపై విచారణ జరపకుండా మీరు నాకు నోటీస్‌లు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో నేను హాజరు కావడం లేదు’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు.