TSRTC : చార్జీలు పెంచడానికి అనుమతించండి ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ మొర

ఆర్టీసీ బస్సు ఛార్జీల విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని, ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ మొర పెట్టుకుంది

TSRTC : చార్జీలు పెంచడానికి అనుమతించండి ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ మొర

Tsrtc

TSRTC Increase Charges : ఆర్టీసీ బస్సు చార్జీల విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని, చార్జీల పెంపుపై ప్రభుత్వానికి టీఎస్ ఆర్టీసీ మొర పెట్టుకుంది. ఇప్పటికే ప్రభుత్వానికి కొత్త చార్జీల ప్రతిపాదన పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…2021, డిసెంబర్ 01వ తేదీ సోమవారం..ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై ఉన్నతాధికారులతో మంత్రి పువ్వాడ చర్చించారు. ఆర్టీసీ సంస్థ పరిస్థితిపై మంత్రికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వివరించారు. 9700 బస్సులను మూడు వేల రూట్లలో 33 లక్షల కిలోమీటర్ల తో 32 లక్షల మందిని గమ్య స్థానానికి చేరుస్తోందన్నారు. గతంలో 20 పైసలు డీజిల్, పెట్రోల్ కారణంగా చార్జీల పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కరోనా కారణంగా..దాదాపు మూడు నుంచి నాలుగు నెలల పాటు..బస్సులు తిరగకపోవడంతో..సంస్థకు భారీనష్టం వచ్చిందన్నారు. కరోనా సెకండ్ వేవ్ లో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా..సంస్థకు ఇబ్బందులు కలుగుతున్నాయని, విడి భాగాలు..ఇతర ముడి సరుకుల రేట్లు అధికమయ్యాయన్నారు. దాదాపు 2, 300 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రస్తుతం నష్టాల నుంచి గట్టెక్కాలంటే…సిటీ బస్సులు..ఇతర బస్సులకు 20 పైసలు చార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని కోరడం జరగుతోందన్నారు. ఇప్పుడు 37 లక్షల ప్రయాణీకులకు ఆర్టీసీ చేరువైందని, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు బస్సులు నడపడం జరుగుతోందన్నారు. గత నెలకింద ధరల ప్రపోజల్స్ ను తయారు చేసి సీఎం కు అందించామని చెప్పారు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్. లాంగ్ డిస్టన్స్ రూట్ లలో బస్సులను నడపడం వల్ల లాభాలు వస్తాయని సీఎం సూచించారని, 14 వందల బస్సులు పూర్తిగా పాడయ్యాయని తెలిపారు. వాటి స్థానంలో కొత్త వాటిని కొనాల్సిన అవసరం ఉందని, ఆర్డినరి బస్సులకు 20పైసలు…ఇతర బస్సులకు 30పైసలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

Read More : Petrol Price: పెట్రోల్‌పై రూ.8 తగ్గించిన ఢిల్లీ గవర్నమెంట్

దీనిపై మంత్రి పువ్వాడ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ల మీద ధరలు పెంచడం వల్ల ఆర్టీసీ మీద తీవ్ర ప్రభావం పడిందన్నారు. నవంబర్ నాటికి రోజు సగటున రూ. 12 కోట్లు ఆర్టీసీ వచ్చిందని, బయట రేట్లతో పోలిస్తే ఆర్టీసీకి కేవలం నాలుగు రూపాయల తగ్గింపు మాత్రమే పెట్రోల్, డీజిల్ మీద ఉంటుందన్నారు. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం విధానాల వల్లే ఆర్టీసీలో ఛార్జీల పెంపు చేయాల్సి వస్తోందని, ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నామన్నారు. ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ఆర్టీసీకి అంత మేలు జరుగుతుందని, 6.8 లక్షల లీటర్ల డీజిల్ ప్రతి రోజు ఆర్టీసీ వినియోగిస్తుందన్నారు. ఆర్టీసీకి ప్రధాన ఆదాయం టికెట్ల ద్వారా వస్తుందని, 2019 డిసెంబర్ 3వ తేదీన ఆర్టీసీ ఛార్జీలు పెంచామనే విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, సెస్ రూపంలో ఆదాయాన్ని కేంద్రం గడించిందన్నారు. మహారాష్ట్రలో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్న విషయాన్ని ఆయన వెల్లడించారు.ఆర్టీసీ ప్రగతి రధ చక్రాలు మళ్ళీ లాభాల బాటలో పడాలని అధికారులకు సూచించారు.

Read More : CM Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన

గతంలో కంటే 27.5 శాతం డీజిల్ ధరల్లో మార్పు ఉందని, ఇంత భారం ఆర్టీసీ మోయలేదన్నారు. ఆర్టీసీకి పునర్ వైభవం తీసుకువచ్చే ప్రయత్నం చైర్మన్, ఎండీ చేస్తున్నారని వారిని ప్రశంసించారు. అనివార్య కారణాల వల్ల ఆర్టీసీ ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం అడుగుతుందని, ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ఎండీ నిర్వహించిన సర్వేలో ప్రజలు 4.3శాతం మాత్రమే ఛార్జీల పెంపుపై విముఖత చూపారన్నారు మిగతా ప్రజలు ఛార్జీల పెంపును సమర్ధించారన్నారు. కోవిడ్ సమయంలో 2 వేల కోట్లు నష్టం వాటిల్లిందని, ఇప్పుడు 1600 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. ఆర్టీసి ఛార్జీలు వెంటనే పెంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. అలాగే..ఆర్టీసీ సంస్థల ఆస్తుల విషయంలో వస్తున్న రూమర్స్ పై ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆర్టీసీ ఆస్తులు అమ్మమని మరోసారి స్పష్టం చేశారు. అలాంటి తప్పుడు ప్రచారం చేయొద్దని మంత్రి పువ్వాడ సూచించారు.