Brothers Suicide : తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్య

అమ్మలేని బాధను తట్టుకోలేకపోయిన ఆ కుమారులిద్దరూ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కన్నతల్లి చనిపోయిన 9 నెల్లల్లోనే అన్నదమ్ములిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మేడ్చల్‌ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన కన్నీరుపెట్టుస్తోంది.

Brothers Suicide : తల్లి మరణాన్ని తట్టుకోలేక అన్నదమ్ముల ఆత్మహత్య

Suicide

two brothers suicide : అమ్మంటే వారికి ఎన‌లేని ప్రేమ‌.. అమ్మే జీవితంగా, అమ్మే లోకంగా బ‌తుకుతున్నారు. అమ్మను విడిచి ఒక‌రోజు కూడా ఉండలేరు. క‌న్నత‌ల్లిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. కానీ తొమ్మిది నెల‌ల క్రిత‌ం అమ్మ వారిద్దరిని విడిచి అనంత‌లోకాల‌కు వెళ్లిపోయింది. అంతే ఆ ఇద్దరి కుమారుల గుండె బద్దలైంది. తల్లికి దూరమై ఉండలేకపోయారు. అమ్మలేని ఈ లోకంలో మాకు ఇంకెవరూ లేరని భావించారు. తల్లినే తలచుకుంటూ ప్రతిరోజూ ఏడ్చేవారు. అమ్మలేని బాధను తట్టుకోలేకపోయిన ఆ కుమారులిద్దరూ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నారు. కన్నతల్లి చనిపోయిన 9 నెల్లల్లోనే అన్నదమ్ములిద్దరూ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మేడ్చల్‌ జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన కన్నీరుపెట్టుస్తోంది.

కీసర మండలం రాంపల్లిదాయరలో నివాసముంటున్న మెట్టు శ్రీనివాస్ రెడ్డి, ప్రమీలకు, యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి, మరో కుమారుడుతో పాటు ఓ కూతురు ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డి మరో వివాహం చేసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ బాధను తట్టుకోలేని కూతురు కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుంచి ప్రమీల ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఇక ముగ్గురు కొడుకులూ హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పెద్ద కొడుకు గండిపేటలో ప్రైవేటు ఉద్యోగం.. యాదిరెడ్డి, మహిపాల్ రెడ్డి దిల్‌సుఖ్‌నగర్‌లో మ్యూజిక్ ఇన్స్‌టిట్యూట్‌లో పని చేస్తున్నారు. హార్మోనియంపై శిక్షణ ఇస్తూ, నెలకు ఒక్కొక్కరు 30 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.

Rajahmundry : వీడిన మిస్టరీ…తల్లి మరణంతో ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు పిల్లలు

వారానికోసారి తల్లి వద్దకు వచ్చి వెళ్లేవారు. ప్రమీల 9 నెలల క్రితం క్యాన్సర్‌తో మృతి చెందింది. అంత్యక్రియల తర్వాత ముగ్గురు అన్నదమ్ములు ఎవరి ఉద్యోగాలకు వాళ్లు వెళ్లిపోయారు. అయితే.. ఈనెల 21న యాదిరెడ్డి, మహిపాల్‌రెడ్డి గ్రామానికొచ్చినట్లు స్థానికులు గుర్తించారు. ఇక గండిపేటలో ఉన్న పెద్దకొడుకు మాధవరెడ్డి తన సోదరులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్‌ లిఫ్ట్‌ చేయలేదని.. అనుమానం వచ్చి పక్కింటి వారికి ఫోన్ చేసి చెప్పడంతో వారు వెళ్లి కిటికీలోంచి చూడగా యాదిరెడ్డి ఫ్యాన్‌కు ఉరివేసుకొని, మహిపాల్ రెడ్డి పురుగుల మందు తాగి చనిపోయినట్లు గుర్తించారు.

ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి ఇంటిని పరీశిలించగా.. కుమారులు రాసిన ఓ సూసైడ్ నోట్ దొరికింది. అందులో ‘మా అమ్మ ప్రేమ లేదు. మా అమ్మ లేదు. మా అమ్మ లేని లోకం మాకొద్దు’ అని రాసి ఉంది’. తమ మరణానికి ఎవరూ కారకులు కాదంటూ సూసైడ్‌ నోట్‌ రాసి ఆత్మహత్య చేసుకున్నారు.