షర్మిల పార్టీ ఎప్పుడంటే, లోటస్ పాండ్ దగ్గర సందడే సందడి

షర్మిల పార్టీ ఎప్పుడంటే, లోటస్ పాండ్ దగ్గర సందడే సందడి

Ys Jagan Sister Sharmila : లోటస్‌పాండ్‌ దగ్గర రెండో రోజు కూడా అభిమానుల సందడి నెలకొంది. పలు జిల్లాల నుంచి షర్మిలను కలిసేందుకు అభిమానులు భారీగా వస్తున్నారు. ఇక షర్మిల రెండో రోజు ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. రానున్న రోజుల్లో జిల్లాల వారిగా సమీక్షలో మాట్లాడాల్సిన అంశాలపై ముఖ్య నేతలతో మాట్లాడనున్నారు. నల్గొండ జిల్లా నేతల సమావేశంపై పూర్తి రివ్యూ చేయనున్నారు. మార్చి చివరి నాటికి తెలంగాణలోని వైఎస్‌ అభిమానులతో చర్చలు పూర్తి చేయనున్నారు. దీని తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు షర్మిల.

షర్మిలా పార్టీ ఆంధ్రలో పెట్టలేదని… దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. తెలంగాణలో పార్టీ వద్దని జగన్ భావించారని… ఆయన ఆలోచనల ప్రకారమే తాము నడుచుకుంటామన్నారు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాలని భావించారని… దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వైఎస్ షర్మిల చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా తెలంగాణలోని అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. షర్మిల పార్టీ పెడితే లాభమా? నష్టమా? అనే కోణంలో లెక్కలు వేసుకుంటోంది. తెలంగాణ వచ్చాక వైఎస్ ఫ్యామిలీ రాజకీయాలు ఏపీకి షిప్ట్ అయ్యాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ఆ కుటుంబం మళ్లీ తెలంగాణ పాలిటిక్స్ పై దృష్టి సారించింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తేవడానికి ప్రయత్నిస్తానని షర్మిల ప్రకటించారు. ఎన్నికలకు మరో రెండు మూడేళ్ల సమయం ఉండటంతో పక్కా ప్రణాళికతోనే రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీకి షర్మిల సిద్ధమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.