YS Sharmila: నేడు గవర్నర్ తమిళిసైతో భేటీ తర్వాత షర్మిల పాదయాత్ర పునఃప్రారంభం
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నేటి నుంచి తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వైఫల్యాలపై గవర్నర్ కు షర్మిల లేఖ అందిస్తారు.

YS Sharmila: వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల నేటి నుంచి తన పాదయాత్రను పునఃప్రారంభించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తో సమావేశం అవుతారు. తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, వైఫల్యాలపై గవర్నర్ కు షర్మిల లేఖ అందిస్తారు.
గవర్నర్ తో సమావేశం అనంతరం నర్సంపేట నియోజక వర్గానికి వెళ్లనున్నారు. చెన్నారావు పేట మండలం శంకరమ్మ తండా నుంచి పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. షర్మిల పాదయాత్ర ఎక్కడ ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచే ఆ యాత్ర ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5.30 గంటలకు నెక్కొండలో మాట-ముచ్చట నిర్వహిస్తారు.
కొన్ని వారాల క్రితం షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడం, అనంతరం ఆమె పాదయాత్ర ఆగిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. షర్మిల కేరవాన్ కు బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించడం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో కలకలం చెలరేగింది. తాను మళ్ళీ ఆ ప్రాంతం నుంచే పాదయాత్ర చేస్తానని షర్మిల కొన్ని రోజుల క్రితం కూడా ప్రకటించారు. తనపై ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని కేసులు పెట్టారని షర్మిల అప్పట్లో మండిపడ్డారు.
Amit Shah Telangana Tour: కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ టూర్ ఖరారు .. 13న ప్రధాని రాక?