YS Sharmila : ఫాదర్ వాటర్ స్కామ్, డాటర్ లిక్కర్ స్కామ్, కేటీఆర్ పేపర్ స్కామ్ : కేసీఆర్ సర్కార్‌పై షర్మిల సెటైర్లు

tspsc పేపర్ లీక్ కు కారణం ఐటీ శాఖ,పేపర్ లీక్ కు పూర్తి బాధ్యత కేటీఆర్ దేనని అన్నారు షర్మిల.పేపర్ లీక్ కు నాకేం సంబంధం అని కేసీఆర్ మాట్లాడారని ఇది అత్యంత దారుణమన్నారు. ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ని ఉద్ధేశించి మీ భాద్యతలు ఏంటో మీకు సోయి ఉందా..?అని ప్రశ్నించారు.

YS Sharmila : ఫాదర్ వాటర్ స్కామ్, డాటర్ లిక్కర్ స్కామ్, కేటీఆర్ పేపర్ స్కామ్ : కేసీఆర్ సర్కార్‌పై షర్మిల సెటైర్లు

YS Sharmila

YS Sharmila : తెలంగాణలో tspsc ప్రశ్నాపత్రాల లీక్ పై వైఎస్సార్ టీపీ ఆధ్వర్యంలో పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఇందిరాపార్క్ వద్ద ‘టీసేవ్’ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా షర్మిల తెలంగాణ సర్కార్ పై తీవ్రంగా మండిపడ్డారు. సీఎం కేసీఆర్, కుమార్తె కవిత, మంత్రి కేటీఆర్ పైనా ఘాటు విమర్శలు చేశారు. ఫాదర్ వాటర్ స్కామ్, డాటర్ లిక్కర్ స్కామ్, కేటీఆర్ పేపర్ స్కామ్ అంటూ సీఎం కేసీఆర్ కుటుంబంపై సెటైర్లు వేశారు. tspsc ప్రశ్నాపత్రాల లీక్ పై సిట్ విచారణ సరిగ్గా జరగటం లేదని, ఈ కేసులో పాత్రధారులను వదిలేసి వారికి క్లీన్ చిట్ ఇస్తున్నారని ఆరోపించారు. అంత సులువుగా పేపర్ ఎలా లీక్ అయ్యిందని.. దీని వెనుక కుట్ర ఉందన్నారు. పేపర్ లీక్ కు నాకేం సంబంధం అని కేటీఆర్ మాట్లాడారని ఇది అత్యంత దారుణమన్నారు. ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ని ఉద్ధేశించి మీ భాద్యతలు ఏంటో మీకు సోయి ఉందా అంటూ  ప్రశ్నించారు. 2018లో టీఎస్ పిఎస్సి లో కంప్యూటర్లు కొన్నారు.. అప్పుడు ఐటీ శాఖ సెక్యురిటి ఆడిట్ చేశారా అని ప్రశ్నించారు. పేపర్ లీక్ కు కారణం ఐటీ శాఖ, పేపర్ లీక్ కు పూర్తి బాధ్యత కేటీఆర్ దేనని అన్నారు షర్మిల.

Telangana : ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి : YS షర్మిల

సిట్ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఈ కేసులో నిందితులను కాపాడుతున్నారని..సి ట్ విచారణ అంతా ప్రగతి భవన్ డైరెక్షన్ లో జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. మీరు నిజంగా దొర అయితే.. కేసీఆర్ కు దమ్ముంటే పేపర్ లీక్ పై సీబీఐ విచారణ జరిపించండి అంటూ డిమాండ్ చేశారు. కేసీఆర్ కు ఒక క్వశ్చన్ పేపర్ పంపిస్తున్నా… 10 క్వశ్చన్స్ కు సమాధానం చెప్పండి అంటూ డిమాండ్ చేశారు. tsave దీక్ష కోసం పోలీసులను అనుమతి అడిగితే నిరాకరించారని.. అదే కోదండరాం దీక్షకు అనుమతి ఇచ్చారని.. కోర్టుకు వెళ్లి తాము అనుమతి తెచ్చుకున్నామని తెలిపారు. నిరుద్యోగుల కోసం నేను చేపట్టిన దీక్షను ఆపాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకే సిట్ కార్యాలయానికి వెళ్లే నన్ను అడ్డుకున్నారని మండిపడ్డారు. మహిళను అడ్డుకునే సమయంలో కనీసం ఆడ పోలీసులు ఉండాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదంటూ పోలీసులను దుయ్యబట్టారు.

తెలంగాణలో నేను పోరాటం మొదలు పెట్టకపోతే అసలు నిరుద్యోగ సమస్య ఉందని తెలిసేదా అన్నారు. పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసం 72 గంటలు దీక్ష చేసింది తానేనన్నారు. నేను తెలంగాణ బిడ్డల కోసం కొట్లాడుతున్నాను. పోలీసులు తెలంగాణ బిడ్డలు కాదా? పోలీసులకు బిడ్డలు లేరా…? ఒక్క మనిషిని అడ్డుకోవడానికి వందల మంది పోలీసులు అవసరమా…? అని ఆగ్రహంగా ప్రశ్నించారు. పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల్లా మారారని విమర్శించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ఫాదర్ వాటర్ స్కామ్, డాటర్ లిక్కర్ స్కామ్, కేటీఆర్ పేపర్ స్కామ్ ఇలా కుటుంబం అంతా పదవుల్లో ఉండి స్కాములు చేస్తున్నారని కానీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేకపోతున్నారంటూ ఘాటు విమర్శలు చేశారు.

Telangana : తెలంగాణ వచ్చాక కన్నీళ్లు తప్ప ఏమొచ్చింది…? ఇక కేసీఆర్ డౌన్ ఫాల్ స్టార్ట్ : గద్దర్