Vegetable Nursery : ఖరీఫ్ కూరగాయల సాగుకు సిద్ధమవుతున్న రైతులు.. నార్ల పెంపకంలో తీసుకోవాల్సిన మెళకువలు
ఖరీఫ్ కూరగాయల సాగుచేసే రైతులు.. మొదటి నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి.

Vegetable Nursery
Vegetable Nursery : పంటల దిగుబడి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడంపైనే ఆధారపడి ఉంటుంది. అధిక దిగుబడులు పొందడానికి నారుమడి దశలోనే రైతాంగం శ్రద్ధ వహించాలి. ఇప్పుడు నూటికి 90శాతంమంది రైతులు హైబ్రిడ్ విత్తనాలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటి ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రతి విత్తనాన్ని మొక్కగా మలిచేటట్లు చూసుకోవాలి. కానీ చాలా వరకు సంప్రదాయ పద్ధతిలోనే నారును పెంచుతున్నారు. కొంత మంది ప్రోట్రేలలో నార్ల పెంపకం చేపడుతున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూరగాయల సాగు చేసే రైతులు నాణ్యమైన నారు అందిరావడానికి ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో సూచిస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.
READ ALSO : Cultivation of Paddy : ఆ ఊర్లో మొత్తం.. వెదపద్ధతిలోనే వరిసాగు
మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, మిటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రపంచ ఆహార సంస్థ నిర్ధేశించిన విధంగా ప్రతి మనిషికి సగటున రోజుకు 300 గ్రాముల కూరగాయలు ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మనదేశంలో కేవలం 230 గ్రా. మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిలో రెండవ స్థానంలో ఉన్నప్పటికీ, ఉత్పాదకతలో వెనుకబడి ఉన్నాం.
READ ALSO : Vari Naarumadi : వరి నారుమడిలో సమగ్ర సస్యరక్షణ
భారతదేశంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ఏడాది పొడవునా కూరగాయలు పండించుటకు అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉంది. సాధారణంగా ఖూరగాయలు ఖరీఫ్, రబీ, వేసవి కాలాలలో సాగుచేస్తారు. రబీ, వేసవితో పోలిస్తే ఖరీఫ్ లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ పంట అనగా వర్షంపై ఆధారపడి రుతుపవనాల రాక నుంచి రుతుపవనాల తిరోగమనం వరకు పండించే పంటలని చెప్పవచ్చు. ఈ పంటలు సాధారణంగా జులై నెలలో ప్రారంభమై తొలకరి వర్షాలలో నాటుతారు. ఈ కాలాన్ని నైరుతి రుతుపవనకాలం అంటారు.
READ ALSO : Virginia Tobacco : ట్రిపుల్ సెంచరీ దిశగా పొగాకు ధరలు
ఖరీఫ్ లో సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉండి దిగుబడి పెరగడం వల్ల రైతుకు ఆదాయం పెరుగుతుంది. కావున ఖరీఫ్ కూరగాయల సాగుచేసే రైతులు.. మొదటి నారుపెంపకంపై జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా కొన్ని రకాల కూరగాయ పంటలకు ముందుగా నారుపోసి తర్వాత పొలంలో నాటాలి. అయితే ఈ రకాల విత్తనాలకు చాలా ఖరీదు ఉంటుంది కాబట్టి.. ప్రతి విత్తనం మొలకెత్తేలాగా చూసుకోవాలి. ప్రతి విత్తనం మొలవాలంటే నారుమడి పెంపకంలో చేపట్టాల్సిన యాజమాన్యం ఏంటో తెలియజేస్తున్నారు , కరీంనగర్ జిల్లా, జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్.
READ ALSO : Vegetable Farming : రెండు ఎకరాల్లో కూరగాయలు సాగు.. ఏడాదికి రూ. 4 లక్షల నికర ఆదాయం పొందుతున్న నల్గొండ రైతు
సంప్రదాయ పద్ధతిలో కంటే ప్రోట్రేలలో నారును పెంచటం వలన ప్రతీ విత్తనం నారుమొక్కగా అందివస్తుంది. షేడ్ నెట్ లలో వాతావరణం నియంత్రణలో వుంటుంది కనుక చీడపీడలు సోకే అవకాశం చాలా తక్కువగా వుంటుంది.నారు మొక్కల్లో వేరువ్యవస్థ సమానంగా పెరగటం వల్ల ప్రధానపొలంలో నాటినపుడు ఎలాంటి ఒత్తిడికి గురికావు. నాటిన వెంటనే పెరుగుదలకు అవకాశం వుంటుంది కనుకు దిగుబడులు ఆశాజనకంగా వుంటాయి.