Cashew Plantation : జీడితోటలో అంతర పంట పత్తిసాగు – అదనపు ఆదాయం పొందుతున్న రైతు
Cashew Plantation : జీడిమామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, జేకే పాడులో ఉంది. ఇక్కడ అన్న జీడి, మామిడితోటలే సాగవుతుంటాయి.

Intercropping in Cashew Plantation
Cashew Plantation : రైతులు తమ వ్యవసాయ పద్ధతుల విధానంలో మార్పులు చేసుకుంటున్నారు. తక్కువ శ్రమతో ఎక్కువగా లాభాలు పొందే విధానాన్ని అలవర్చుకుంటూ ముందుకుపోతున్నారు. ఎక్కువగా మామిడి, బొప్పాయి, అరటి పంటలు సాగు చేసే రైతులు అంతర పంటలుగా వివిధ రకాల కూరగాయలు పంటలను ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ.. మన్యం జిల్లాకి చెందిన ఓ గిరిజన రైతు జీడిమామిడిలో అంతర పంటలు సాగుచేసి అదనపు ఆదాయం పొందుతున్నారు.
Read Also : Agri Tips : వ్యవసాయంలో యాంత్రీకరణతో కూలీల కొరతకు చెక్ – సమయం ఆదాతో పాటు తగ్గనున్న పెట్టుబడులు
జీడిమామిడి మొక్కల మధ్య అంతర పంటలు సాగుచేసిన ఈ క్షేత్రం పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, జేకే పాడులో ఉంది. ఇక్కడ అన్న జీడి, మామిడితోటలే సాగవుతుంటాయి. అయితే ఏడాదికి ఒక పంట మాత్రమే చేతికి వస్తుంది. తరువాత తోటలను వదిలేస్తుంటారు రైతులు.
కానీ రైతు అగ్గయ్య మాత్రం తనకున్న 5 ఎకరాల జీడితోటలలో మొక్కల మధ్య దూరాన్ని ఉపయోగించుకొని అంతర పంటలు సాగుచేస్తూ.. అదనపు ఆదాయం పొందుతున్నారు. దీర్ఘకాలిక పంటలను వేస్తున్నా, అందులో కూడా అంతర పంటలను వేసి ఏమాత్రం భూమిని, సమయాన్ని వృథా చేయకుండా రాబడి పొందుతున్నా రైతు అగ్గన్న సాటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు