Mustard Farming : నవంబర్ వరకు ఆవాలు విత్తుకునే అవకాశం.. అధిక దిగుబడులకు యాజమాన్యం

Mustard Farming : మనదేశంలో సాగయ్యే నూనె గింజ పంటల్లో ముఖ్యమైనది ఆవాలు. ఉత్తర భారత దేశంలో ప్రధానంగా సాగయ్యే ఆవాలను, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాతో పాటు మరొకొన్ని జిల్లాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు.

Mustard Farming : నవంబర్ వరకు ఆవాలు విత్తుకునే అవకాశం.. అధిక దిగుబడులకు యాజమాన్యం

Mustard Farming

Updated On : November 19, 2024 / 5:12 PM IST

Mustard Farming : భారతదేశంలో సాగు చేస్తున్న నూనెగింజల పంటలలో.. అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న పంట ఆవాలు. ఈ పంటను ప్రధానంగా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా , మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. ఇందులో 37 నుండి 42 శాతం నూనె ఉంటుంది. గత నాలుగైదేళ్లుగా ఆవాలు పంట వేయడానికి ఉత్తర తెలంగాణలో రైతులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అధిక దిగుబడికోసం సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలం కళాశాల ప్రొఫెసర్ సుజాత.

మనదేశంలో సాగయ్యే నూనె గింజ పంటల్లో ముఖ్యమైనది ఆవాలు. ఉత్తర భారత దేశంలో ప్రధానంగా సాగయ్యే ఆవాలను, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాతో పాటు మరొకొన్ని జిల్లాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ముఖ్యంగా  తక్కువ పెట్టుబడి, తక్కువ సమయం, తక్కువ నీటి వినియోగంతోనే పంట చేతికి వస్తుండటం, ఇటు మార్కెట్ లో కూడా మంచి ధర పలుకుతుండటంతో సాగు విస్తీర్ణం ఏటేటా పెరుగుతుంది.

ఖరీఫ్ సీజన్లో వరి, మొక్కజొన్న, సోయాబిన్, పత్తి వంటి పంటలను సాగుచేసి, రబీలో రెండవ పంటగా ఆవాలు సాగుచేస్తున్నారు రైతులు . అయితే అనుకున్న స్థాయిలో దిగుబడులను పొందలేకపోతున్నారు. నాణ్యమైన అధిక దిగుబడిని పొందాలంటే సాగులో మేలైన యాజమాన్యం పాటించాలని తెలయిజేస్తున్నారు  జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా. సుజాత.

Read Also : Farming Methods : పెంపకానికి అనువైన గొర్రెల రకాలు