బొప్పాయి తోటల్లో పెరిగిన పిండినల్లి ఉధృతి.. నివారణోపాయం

బొప్పాయి పంట చివరిదశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండినల్లి. ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా, కూరగాయలు, పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది.

బొప్పాయి తోటల్లో పెరిగిన పిండినల్లి ఉధృతి.. నివారణోపాయం

Papaya Farming: బొప్పాయిలో పోషకాలు అధికంగా వుండటంతో వినియోగం నానాటికీ పెరుగుతోంది. దీంతో వీటిని పండిస్తున్న రైతులకు సాగు ఆశాజనకంగా మారింది. అయితే ఈపంటలో చీడపీడల వ్యాప్తి నానాటికీ పెరిగిపోతుండటంతో సాగులో విజయం సాధించే వారి సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. ప్రధానంగా మొక్క నాటిన దగ్గర నుండి పంట చివరి వరకు పిండినల్లి బెడద రైతుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎన్ని నివారణ చర్యలు చేపట్టినా తిరిగి దాడిచేస్తుండటంతో దిగుబడి గణనీయంగా తగ్గిపోతోంది. దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య చర్యలను తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎ వెంకటరెడ్డి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగువిస్తీర్ణం నానాటికి పెరుగుతోంది. ఒకప్పుడు పెరటితోటలకే పరిమితమైన బొప్పాయి సాగుకు, ఇంత ప్రాధాన్యం పెరగటానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలని చెప్పవచ్చు. ప్రస్థుతం రైతులు హెక్టారుకు 50 నుండి 100 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. అయితే ఈ పంటకు చీడపీడల సమస్య ఎక్కువ వుండటం వల్ల ఇటీవలికాలంలో సాగులో విజయాల శాతం తగ్గిపోతోంది. ముఖ్యంగా రసంపీల్చు పురుగుల దాడి వల్ల వైరస్ తెగుళ్ల వ్యాప్తిచెందుతున్నాయి. బొప్పాయి పంట చివరిదశ వరకు రైతును వెన్నాడుతున్న సమస్య పిండినల్లి. ఇది ఒక్క బొప్పాయిలోనే కాకుండా, కూరగాయలు, పండ్ల తోటలను ఆశించి తీవ్రంగా నష్టపరుస్తోంది. కాబట్టి రైతులు జాగ్రత్త వహించాలి.

పంట అయిపోయాక ఎండిన చెట్లు. నేల రాలిన ఆకులను ఏరి తగులబెట్టడం ద్వారా పిండి నల్లిని నివారించవచ్చు. వాస్తవానికి ఈ పిండి నల్లి మనదేశానికి సంబంధించిన పురుగు కాదు. మెక్సికో కు చెందిన ఈ పురుగు, మన దేశానికి రవాణా ద్వారా వచ్చి చేరి తీవ్రంగా నష్టపరుస్తోంది. కాబట్టి రైతులు సోదరులు ఈ పురుగు పట్ల జాగ్రత్త వహించి, తొలిదశనుండే శాస్త్రవేత్తల సూచనలు పాటించినట్లైతే నాణ్యమైన అధిక దిగుబడులు తీసేందుకు అవకాశం ఉంటుంది.