Snake Gourd Farming : పొట్ల పంట పందిరిపై పెరిగిన తెగుళ్ల ఉదృతి

Snake Gourd Farming : పంటల సాగులో రైతులు పాత పద్ధతులను వీడి ఆధునిక సాగు వైపు అడుగులు వేస్తున్నారు. మూస ధోరణితో వ్యవసాయం చేస్తే ఆశించిన ఆదాయం రాక రైతులు నష్టపోతున్నారు.

Snake Gourd Farming : పొట్ల పంట పందిరిపై పెరిగిన తెగుళ్ల ఉదృతి

snake gourd farming pest control management

Snake Gourd Farming : వరి, పత్తి, మిర్చి లాంటి పంటల సాగుతో నష్టాలను తట్టుకోలేక  కూరగాయలపై దృష్టిసారిస్తున్నారు రైతులు. కర్రలతో పందిళ్లు వేసి, ప్రతి నీటిబొట్టును పదిలంగా వాడుకుంటూ కాయగూరలు పండిస్తున్నారు. మార్కెట్‌ అవసరాలను గుర్తిస్తూ… పంటల సరళిని పాటించడం వల్ల లాభసాటి ధరలను సొంతం చేసుకుంటున్నాడు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. అయితే ఈ సారి మాత్రం పొట్లసాగుతో నష్టాలను మూటగట్టుకున్నారు.

Read Also : Kharbuja Cultivation : వేసవిలో మంచి డిమాండ్.. కష్టాలు తీర్చుతున్న కర్బుజా సాగు

పంటల సాగులో రైతులు పాత పద్ధతులను వీడి ఆధునిక సాగు వైపు అడుగులు వేస్తున్నారు. మూస ధోరణితో వ్యవసాయం చేస్తే ఆశించిన ఆదాయం రాక రైతులు నష్టపోతున్నారు. అందుకే మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్‌ ఉండే కూరగాయల సాగు చేపట్టి మంచి లాభాలను పొందుతున్నారు అన్నదాతలు. ఈ కోవలోనే తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం, ఖండవల్లి గ్రామానికి చెందిన రైతు నాగేశ్వర రెడ్డి ఇతర పంటలతో పాటు అర ఎకరంలో పందిరి కూరగాయల సాగు చేపట్టారు.

స్థానికంగా దొరికే కర్రలను ఉపయోగించి తక్కువ ఖర్చుతో బీర, కాకర, సొర, దొండ వంటి తీగజాతి కూరగాయలను సాగుచేస్తూ.. మంచి లాభాలను గడిస్తున్నారు. అయితే ఈ సారి వేసిన పొట్ల పంటకు తెగుళ్లు సోకడంతో మొక్కలు మొత్తం ఎండిపోతున్నాయి. కాయల ఎదుగుదల నిలిచిపోవడంతో మార్కెట్ లో ధర రావడంలేదు. ఎన్ని మందులు పిచికారి చేసినా ఫలితం లేదంటున్నారు రైతు.

Read Also : Pest Control in Kandi : రబీ కందిలో పురుగుల నివారణ