Kharif Pesara : పెసర సాగులో చీడపీడల నివారణ కు సూచనలు
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు , పంటలో వివిధ రకాల చీడపీడలు ఆశించాయి. అధిక వర్షాల వల్ల పైరు ఎత్తు ఎక్కువ పెరిగి, రొట్ట బాగాచేసింది. పంట దట్టంగా అలుముకోవటంతో లద్దెపురుగు, మారుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదం ఉంది

Kharif Pesara
Kharif Pesara : ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చే పంట పెసర. భూమికి సారం ఇవ్వటంతోపాటు రైతుకు ఆర్థికంగా చేయూతనిస్తుంది. ప్రస్తుతం పంట ఎదుగుదల నుండి, పూత, పిందె దశలో ఉంది . ఇటీవల కురుసిన వర్షాలకు కొన్నిప్రాంతాల్లో చీడపీడల బెడద కనిపిస్తోంది. వీటి నుండి పంటను కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డా. జగన్ మోహన్ రావు.
READ ALSO : Cotton Crop : వర్షాలు పడుతున్న సమయంలో పత్తిలో పాటించాల్సిన మెళుకువలు
వాయిస్ ఓవర్ : పెసర పంటను వర్షాధారంగా, నీటిపారుదల కింద మూడు కాలాల్లోను సాగుచేస్తున్నారు . ముఖ్యంగా తెలంగాణలో కంది తరువాత పెసర ను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తారు. కొంత విస్తీర్ణంలో మినుమును కూడా సాగులో వుంది. ఖరీఫ్ లోవిత్తిన పెసర వివిధ ప్రాంతాల్లో ఎదుగుదల దశ నుండి పూత, పిందె దశలో ఉంది.
READ ALSO : Prevention Of Pests : మినుము, పెసర పంటలో చీడపీడల నివారణ!
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు , పంటలో వివిధ రకాల చీడపీడలు ఆశించాయి. అధిక వర్షాల వల్ల పైరు ఎత్తు ఎక్కువ పెరిగి, రొట్ట బాగాచేసింది. పంట దట్టంగా అలుముకోవటంతో లద్దెపురుగు, మారుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదం ఉంది. వీటిని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలంటున్నారు శాస్త్రవేత్తలు.
READ ALSO : Black Gram Cultivation : అధిక దిగుబడులకోసం ఖరీఫ్ మినుములో మేలైన యాజమాన్యం
పెసరలో రైతులను ఆర్ధికంగా నష్టపరిచే పురుగు మారుకా మచ్చల పురుగు . వాతావరణం మేఘావృతమవడం , చిరుజల్లులు పడటం ఈ పురుగు సోకేందుకు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా ఈ పురుగు మొగ్గలు , పూతదశలో ఆశించి ఎక్కువగా నష్టం కలుగజేస్తుంది. పూత దశలో పూలను గూడుగా చేసి లోపలి పదార్ధాలను తింటుంది. కాయలు తయారయ్యేటప్పుడు దగ్గరకు చేర్చి గూడుగా కట్టి, కాయలకు రంధ్రం చేసి లోపలి గింజలను తినటం వలన పంటకు ఎక్కువ నష్టం కలుగుతుంది.
READ ALSO : Pests Damaging Banana : అరటి తోటలను నష్టపరుస్తున్న తెగుళ్లు.. నివారణకు చేపట్టాల్సిన చర్యలు
కాబట్టి రైతులు పంటలో 50 శాతం పూత కనిపించినట్లైతే ముందుగానే ఈ పురుగు నివారణకు చర్యలు చేపట్టాలి. అలాగే చేలల్లో నీరు చేరడం వలన పోషకాల లోపం కూడా ఏర్పడుతుంది. ఈ సమయంలో మొక్కలపై పిచికారి ద్వారా పోషకాలు అందించడం వల్ల అధిక దిగుబడులను పొందే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్త.