బ్రాండ్ ఏపీని క్రియేట్ చేస్తూ సాగుతున్న కూటమి ఏడాది పాలనపై 10టీవీ మెగా ఈవెంట్ Shining AP
అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్.. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని ఆంధ్రప్రదేశ్‌ను దశలవారీగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

Shining AP
Shining AP: 164 సీట్ల భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం బ్రహ్మరథం పట్టింది. సూపర్ సిక్స్ హామీలతో అశేష ప్రజానీకం మనసు దోచుకున్న చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్.. హామీలను క్రమంగా నెరవేరుస్తూ అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఏడాది పాలనలో అమరావతి రాజధాని, పోలవరం లాంటి స్వప్నాలను సాకారం చేస్తూ ముందుకు సాగుతోంది.
దేశంలో అతి ఎక్కువ పెన్షన్‌తో భరోసానిస్తూ సంక్షేమ పథంలో అడుగులు వేస్తోంది. తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుడుతోంది. రానున్న రోజుల్లో అన్ని హామీలను నెరవేర్చడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ పాలన సాగిస్తోంది కూటమి సర్కార్.. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని ఆంధ్రప్రదేశ్‌ను దశలవారీగా అగ్రగామి రాష్ట్రంగా నిలిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో కూటమి ప్రభుత్వానికి ఏడాది సందర్భంగా 10టీవీలో ఎక్స్ క్లూజివ్ కవరేజ్.. షైనింగ్ ఏపీ.. ఉదయం 9 గంటల నుంచి..