AP Corona Cases : ఏపీలో కొత్తగా 22,164 కరోనా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 22,164 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

AP Corona Cases : ఏపీలో కొత్తగా 22,164 కరోనా పాజిటివ్‌ కేసులు

22164 New Corona Positive Cases In Ap

Updated On : May 10, 2021 / 6:16 AM IST

new corona cases in AP : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 22,164 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో కరోనాతో 92 మంది మృతి చెందారు. వైరస్‌ బారినపడిన వారిలో 18,832 మంది కోలుకున్నారు.

ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసులు 12,87,603కు పెరిగాయి. ఇప్పటివరకు 10,88,264 మంది కోలుకున్నారు. యాక్టివ్‌ కేసులు మొత్తం 1,90,632కు చేరాయి.

కరోనా బారిన పడి 8,707 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇవాళ 1,05,494 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.