Covid report : ఏపీలో కొత్తగా 2,765 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 31,892 శాంపిల్స్ పరీక్షించగా వారిలో కొత్తగా 2,765 మంది కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.

Ap Corona Cases
2765 New Covid cases recorded in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న 31,892 శాంపిల్స్ పరీక్షించగా వారిలో కొత్తగా 2,765 మంది కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 9,18,597 చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1,245 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా ఇళ్లకు తిరిగి వెళ్లారని ఆ బులెటిన్ లో వివరించారు.
ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,94,896 కి చేరింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల 11 మంది మరణించారు. వారిలో అనంతపురంలో ఇద్దరు, చిత్తూర్ లో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విశాఖపట్నంలో ఇద్దరు, గుంటూరు, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఒక్కోక్కరు చోప్పున మరణించారు.
రాష్ట్రంలో ఇంతవరకు కోవిడ్ వలన మరణించిన వారి సంఖ్య 7,279 కి చేరింది. కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 16,422యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,53,65,743 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వైద్య,ఆరోగ్య శాఖ పేర్కోంది.