ఆంధ్రప్రదేశ్‌లో 24గంటల్లో 326 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో 24గంటల్లో 326 కరోనా కేసులు

Updated On : January 1, 2021 / 7:48 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 58,519 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8లక్షల 82వేల 612కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు కరోనాతో 7వేల 108 మంది చనిపోయారు.


గత 24గంటల్లో కరోనా నుంచి కోలుకుని 350మంది బయటకు రాగా.. ఇప్పటివరకు 8లక్షల 72వేల 266మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3వేల 238 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.