సంక్రాంతికి 4029 బస్సులు సిధ్ధం
సంక్రాంతి పండక్కి బస్సులు రెడీ

సంక్రాంతి పండక్కి బస్సులు రెడీ
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ రెగ్యులర్ సర్వీసులతో కలుపుకుని 4వేల 29 బస్సులు నడిపేందుకు సిధ్దమయ్యింది. వీటిలో ఏపీ నుంచి హైదరాబాద్‌కు 2 వేల బస్సులు , హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రధాన నగరాలకు, పట్టణాలకు వెళ్లే ప్రయాణికుల కోసం 2,029 బస్సులు నడపనున్నారు. హైదరాబాద్ నుంచి బస్సులు ఎంజీబిఎస్ నుంచి బయలు దేరతాయి. అలాగే ఏపీ లోని అన్నిజిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ కు 2 వేల బస్సులను నడుపుతారు. ఈ బస్సులను ఏపీఎస్ ఆర్టీసీ జనవరి 9నుంచి 15 వరకు నడపనుంది. హైదరాబాద్ లో ఏపీఎస్ ఆర్టీసి బస్సులు నిలుపుకునేందుకు సరైన సదుపాయం లేకపోవటంతో రెండు రాష్ట్రాల అధికారులు సమన్వయంతో చర్చించిన మీదట ఏపీఎస్ఆర్టీసీ బస్సులు నిలిపేందుకు టీఎస్ఆర్టీసీ అధికారులు ఎంజీబీఎస్ లో స్ధలం కేటాయించారు.