Amarnath : అమర్‌నాథ్‌లో చిక్కుకున్న 50 మంది అనంత జిల్లా వాసులు

రెవెన్యూ అధికారులు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల సమాచారం అందించారు. వారు ఈ రోజు ఉదయం తిరుగు ప్రయాణం అవుతారని కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెబుతున్నారు.

Amarnath : అమర్‌నాథ్‌లో చిక్కుకున్న 50 మంది అనంత జిల్లా వాసులు

Amarnath

Updated On : July 12, 2022 / 7:44 AM IST

Amarnath trip : అనంతపురం జిల్లాకు చెందిన 50 మంది అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్నారు. జిల్లా కలెక్టరేట్ వర్గాలు 50 మంది వివరాలను సేకరించాయి. జిల్లా అధికారులు అందరి ఆచూకీ కనుగొన్నారు. నేరుగా వారితోనే అధికారులు సంప్రదిస్తున్నారు. అమర్ నాథ్ యాత్రలో చిక్కుకున్న అందరూ సురక్షితంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. 50 మందిలో 12 మంది అనంతపురం నగరంలోని 5వ రోడ్డు వాసులుగా గుర్తించారు.

రెవెన్యూ అధికారులు వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల సమాచారం అందించారు. వారు ఈ రోజు ఉదయం తిరుగు ప్రయాణం అవుతారని కుటుంబ సభ్యులకు రెవెన్యూ అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి చెబుతున్నారు. జిల్లా వాసులను స్వస్థలం చర్చేందుకు జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Amarnath Yatra : అమర్ నాథ్ యాత్రలో తాడేపల్లిగూడెం యాత్రికులు గల్లంతు

అమర్‌నాథ్‌లో గత శుక్రవారం నాటి వరదల కారణంగా 16 మంది మృతి చెందారు. దాదాపు 36 మంది వరకు గల్లంతయ్యారు. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. దీంతో శని, ఆదివారాల్లో యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. బాధితుల్ని రక్షించేందుకు ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు ప్రయత్నిస్తున్నాయి. హెలికాప్టర్లను కూడా వినియోగిస్తున్నారు.

శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం ఆదివారం రాడార్లను ఇండియన్ ఆర్మీ ప్రయోగించింది. గాయపడ్డవారిలో 35 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. మరో 17 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. యాత్రికుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు, యాత్ర సజావుగా సాగుతుందని భావిస్తున్నట్లు అమర్‌నాథ్ యాత్ర కమిటీ తెలిపింది.