Chandrababu : చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
చంద్రబాబు బెయిల్ పిటీషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. దీంతో చంద్రబాబుకు ఈరోజు ఊరట లభించలేదు.

chandrababu Naidu
Chandrababu bail petition postpones ACB court : చంద్రబాబు బెయిల్ పిటీషన్ ను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగిందని దానికి ప్రధాన సూత్రధారి చంద్రబాబు అనే ఆరోపణలో అరెస్ట్ అయిన చంద్రబాబు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్ కోసం వేసిన పిటీషణ్ పై ఏసీబీ కోర్టు విచారించింది. బెయిల్ పిటీషన్ తో పాటు మధ్యంత పిటీషన్ పై కూడా ఏసీబీ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం విచారణను సెప్టెంబర్ 19కు వాయిదా వేసింది.దీంతో చంద్రబాబుకు ఊరట లభించలేదు.
చంద్రబాబు మధ్యంతర బెయిల్, జనరల్ బెయిల్ కోసం పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై ఈరోజు విచారణ చేపట్టింది ఏసీబీ కోర్టు. చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటీషన్ కు అర్హత లేదంటు సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. ప్రాథమిక సాక్ష్యాలతో అరెస్ట్ చేసిన వ్యక్తికి మధ్యంతర బెయిల్ ఇవ్వవద్దని..అసలు పిటీషన్ కు అర్హత ఉందా..? లేదా..? అనే విషయంపై విచారణ జరపాలని కోరారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని..మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వవచ్చు అంటూ చంద్రబాబు తరపు న్యాయవాది వాదించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 19కు వాయిదా వేసింది.
కాగా చంద్రబాబు అరెస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు భార్య భువనేశ్వరితో పాటు పార్టీ శ్రేణులు జైలులో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈక్రమంలో భువనేశ్వరి మరోసారి చంద్రబాబుతో ములాఖత్ కు దరఖాస్తును కూడా జైలు అధికారులు నిరాకరించారు. దీంతో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు కొనసాగిస్తోంది అంటూ విమర్శలు వస్తున్నాయి.