CRDA కార్యాలయానికి రైతుల క్యూ

అమరావతి రైతులతో తుళ్లూరు CRDA ఆఫీసు కిక్కిరిసిపోతోంది. రాజధాని తరలింపుపై హై పవర్ కమిటీకి అభిప్రాయాలు చెప్పేందుకు రైతులు వస్తున్నారు. తమ అభిప్రాయాలు చెప్పేందుకు మరికొంత సమయం కావాలని రైతులు హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలా 30 నిమిషాల వరకు సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో 2020, జనవరి 20వ తేదీ సోమవారం వరకు రైతులు అభిప్రాయాలు తెలియచేసే అవకాశం దక్కింది.
2020, జనవరి 13వ తేదీ నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతోంది. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని రైతులు వినతిపత్రాలు ఇచ్చారు. తొలుత మందకొడిగానే సాగింది. లాస్ట్ డేన పెద్ద ఎత్తున రైతులు రావడంతో సీఆర్డీఏ కార్యాలయం కిక్కిరిసిపోయింది. మహిళా రైతులు ర్యాలీగా తరలివచ్చి అభిప్రాయాలను వెల్లడించారు. అయితే..తగిన సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. వారందరి వద్దవున్న పేపర్లను తీసుకొని తాము కంప్యూటర్లలో నమోదు చేస్తామన్నారు. సుమారు ఏడువేల మంది రైతులు లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలు తెలియజేశారు.
అభిప్రాయం వెల్లడించినట్లు..అక్నాలెడ్జిమెంట్ వెంటనే ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తాజాగా హైకోర్టు గడువు పెంచడంతో శనివారం తమ అభిప్రాయాలు సమర్పిస్తామని వెళ్లిపోయారు. ఇప్పటిదాకా సుమారు 30 వేల మందికి పైగా అభిప్రాయాలు తెలిపినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు 20 వేల మంది అమరావతి ప్రాంత రైతులు కాగా, మిగతావారు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి అభిప్రాయాలు తెలియజేశారు.
Read More : రాజావారి రుచులు బిర్యానీలో ఐరన్ వైర్..రూ. 5 వేల ఫైన్