పవన్ వ్యాఖ్యలపై అంబటి రాంబాబు ట్వీట్.. హోం మంత్రికి కూటమిలోనే అసంతృప్తి అంటూ విమర్శలు
"హోం మంత్రి పదవి తీసుకొని ప్రతాపం చూపండి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారో? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణస్తుంది" అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

తాను హోం మంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హోం మంత్రి అనిత రివ్యూ చేయాలని, అలాగే, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని, పోలీసులు మరచిపోవద్దని పవన్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. పవన్‌కు పలు సూచనలు చేశారు.
“హోం మంత్రి పదవి తీసుకొని ప్రతాపం చూపండి. స్వామి ఆదిత్యనాథ్ అవుతారో? కిల్ బిల్ పాండే అవుతారో? కాలమే నిర్ణస్తుంది! హోం మంత్రికి హోం లోనే (కూటమిలో) అసంతృప్తి!” అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
కాగా, పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ జాతీయ మీడియాలోనూ వచ్చాయి. మిత్రపక్ష పార్టీ టీడీపీపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారని, హోం మంత్రి అనితకు వార్నింగ్ ఇచ్చారని జాతీయ మీడియా కూడా పేర్కొంటోంది. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పలువురు వైసీపీ నేతలు కూడా స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
కర్నూలులో యురేనియం వివాదం.. అధికారులను అడ్డుకున్న గ్రామస్తులు..