Anantha Babu: ఈ ఆనందం నా కన్నీళ్ల రూపంలో కనపడుతోంది: ఎమ్మెల్సీ అనంత బాబు
సంవత్సర కాలంగా తాను ప్రజలకు దూరంగా ఉన్నానని అనంతబాబు చెప్పారు.

Anantha Babu
Anantha Babu – YSRCP: ఎమ్మెల్సీ అనంతబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని అల్లూరి జిల్లా (Alluri Sitharama Raju district) చింతూరు, కూనవరం బహిరంగ సభలో అనంతబాబు మాట్లాడారు. తాను సంవత్సర కాలం నుంచి పడ్డ ఇబ్బందులు అన్నీ ఇక్కడి ప్రజలను చూసి మర్చిపోయానని, ఆ ఆనందం తన కన్నీళ్ల రూపంలో కనపడుతోందని చెప్పుకొచ్చారు.
సంవత్సర కాలంగా తాను ప్రజలకు దూరంగా ఉన్నానని అనంతబాబు చెప్పారు. వరదలు వచ్చిన సమయంలో తాను ప్రజలతో లేనందుకు, వారికి సేవ చేసుకోలేకపోయినందుకు చాలా బాధపడ్డానని తెలిపారు. తాము కన్ను ఎర్ర చేస్తే ప్రతిపక్షాలు కనీసం ఒక సభ కూడా నిర్వహించుకోలేవని అన్నారు.
కానీ, తాము అలా చేయబోమని చెప్పారు. ప్రతి ఒక్కరికీ సభ పెట్టుకునే హక్కు ఉందని తెలిపారు. తాను వైసీపీ జెండా పెట్టుకుని ప్రజల్లో తిరిగితే ప్రతిపక్ష పార్టీలకు భయం పుడుతుందని చెప్పుకొచ్చారు. తాము పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ రాకుండా చేశారని ఆరోపించారు.
YS Sharmila: మాయల పకీరు ప్రాణాలు చిలకలో ఉన్నట్లు.. కేసీఆర్ అవినీతి చిట్టా అంతా..: షర్మిల