Andhra Pradesh Coronavirus : ఏపీలో 2,982 కొత్త కరోనా కేసులు.. 27 మంది మృతి

ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల వ్యవధిలో 2 వేల 982 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

Andhra Pradesh Coronavirus : ఏపీలో 2,982 కొత్త కరోనా కేసులు.. 27 మంది మృతి

Andhra Pradesh Coronavirus (2)

Updated On : July 8, 2021 / 5:57 PM IST

Andhra Pradesh Coronavirus : ఏపీలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గత 24 గంటల వ్యవధిలో 2 వేల 982 మందికి కరోనా సోకింది. 27 మంది చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

ఏపీలో ప్రస్తుతం 31 వేల 850 యరోనా యాక్టివ్ కేసులున్నాయి. 12 వేల 946 మంది మృతి చెందారు. ప్రకాశం ఆరుగురు చనిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 616 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,14,213 పాజిటివ్ కేసులకు గాను 18,69,417 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారంటే :

ప్రకాశం జిల్లాలో ఆరుగురు మృతి చెందారు.. కృష్ణా ఐదుగురు చిత్తూరులో నలుగురు , తూర్పు గోదావరిలో నలుగురు, అనంతపూర్ లో ఇద్దరు, గుంటూరులో, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసులు :

అనంతపురం 95. చిత్తూరు 401. ఈస్ట్ గోదావరి 616. గుంటూరు 242. వైఎస్ఆర్ కడప 120. కృష్ణా 298. కర్నూలు 32. నెల్లూరు 208. ప్రకాశం 345. శ్రీకాకుళం 92. విశాఖపట్టణం 120. విజయనగరం 50. వెస్ట్ గోదావరి 363. మొత్తం : 2, 982